Telugu Global
Cinema & Entertainment

 ఎట్టకేలకు పవన్-కాజల్ కలిసిపోయారు

గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా కొనసాగుతన్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నాడు. కాజల్ పై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి పవన్, కాజల్ కలుసుకోలేదు. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. పవన్-కాజల్ జంటగా నటిస్తున్న సన్నివేశాల్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈమధ్యే తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్న పవన్ కల్యాణ్, […]

 ఎట్టకేలకు పవన్-కాజల్ కలిసిపోయారు
X
గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా కొనసాగుతన్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నాడు. కాజల్ పై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి పవన్, కాజల్ కలుసుకోలేదు. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. పవన్-కాజల్ జంటగా నటిస్తున్న సన్నివేశాల్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈమధ్యే తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్న పవన్ కల్యాణ్, తిరిగి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ పైకి వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే కాజల్ తో వచ్చే సీన్లు అన్నీ తీసేయాలని నిర్ణయించారు మేకర్స్. మరోవైపు పవన్-విలన్స్ మధ్య సన్నివేశాల్ని నెక్ట్స్ షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను సంక్రాంతికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
First Published:  11 Sep 2015 7:00 PM GMT
Next Story