Telugu Global
Cinema & Entertainment

హైదరాబాద్ కు చేరిన నాయిక

తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది నాయిక సినిమా. త్రిష లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరోవైపు దీన్ని తెలుగులోకి డబ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. కానీ తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా సినిమా చేస్తున్నారు. ఇన్నాళ్లు చెన్నై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈనెల 18 నుంచి నాయిక సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం […]

హైదరాబాద్ కు చేరిన నాయిక
X
తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది నాయిక సినిమా. త్రిష లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరోవైపు దీన్ని తెలుగులోకి డబ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. కానీ తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా సినిమా చేస్తున్నారు. ఇన్నాళ్లు చెన్నై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈనెల 18 నుంచి నాయిక సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. త్రిషతో పాటు గణేష్ వెంకట్రామన్, కోవై సరళ, జయప్రకాష్, బ్రహ్మానందం ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ సినిమాకు రఘు కుంచె సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి, డిసెంబర్ నాటికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తెలుగులో పాపులర్ అవ్వాలని చూస్తోంది త్రిష.
First Published:  11 Sep 2015 7:01 PM GMT
Next Story