Telugu Global
Cinema & Entertainment

ఖైరతాబాద్ గణేశుడి చెంత డిక్టేటర్

ప్రస్తుతం తన 99వ సినిమాగా డిక్టేటర్ ను తెరకెక్కిస్తున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాలో వినాయకుడిపై ఓ పాట ఉంది. సో.. వినాయక చవితి కానుకగా ఈ పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ పాట టీజర్ ఎడిటింగ్ వర్క్ కూడా ఫాస్ట్ గా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 17న ఖైరతాబాద్ వినాయకుడి వద్ద డిక్టేటర్ […]

ఖైరతాబాద్ గణేశుడి చెంత డిక్టేటర్
X
ప్రస్తుతం తన 99వ సినిమాగా డిక్టేటర్ ను తెరకెక్కిస్తున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాలో వినాయకుడిపై ఓ పాట ఉంది. సో.. వినాయక చవితి కానుకగా ఈ పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ పాట టీజర్ ఎడిటింగ్ వర్క్ కూడా ఫాస్ట్ గా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 17న ఖైరతాబాద్ వినాయకుడి వద్ద డిక్టేటర్ సాంగ్ టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ రోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు డిక్టేటర్ లోని వినాయకుడి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న డిక్టేటర్ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ సమర్పిస్తోంది.
First Published:  11 Sep 2015 7:04 PM GMT
Next Story