Telugu Global
Others

తెలంగాణ ప్రభుత్వంతో సెల్‌కాన్‌ ఎంఓయూ

రాష్ట్ర ప్రభుత్వంతో సెల్‌కాన్, మకేనా మధ్య ఎంఓయూ కుదిరింది. రాష్ట్రంలో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సెల్‌కాన్, మకేనాతో ఒప్పందం కుదిరింది. చెత్త నుంచి ఇంధనం ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయమందించాలని సీఎం న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్‌జులను కోరారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. చైనా పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ షాంఘైలో సీఐఐ, తెలంగాణ […]

రాష్ట్ర ప్రభుత్వంతో సెల్‌కాన్, మకేనా మధ్య ఎంఓయూ కుదిరింది. రాష్ట్రంలో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సెల్‌కాన్, మకేనాతో ఒప్పందం కుదిరింది. చెత్త నుంచి ఇంధనం ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయమందించాలని సీఎం న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్‌జులను కోరారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. చైనా పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ షాంఘైలో సీఐఐ, తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై సీఎం ఈ సమావేశంలో చైనాకు చెందిన 65 మంది పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
First Published:  10 Sep 2015 1:04 PM GMT
Next Story