Telugu Global
Cinema & Entertainment

 నితిన్-త్రివిక్రమ్ సినిమా పక్కా

ఎట్టకేలకు లాంగ్ గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా డీటెయిల్స్ ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. నితిన్ తో సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించిన ఈ స్టార్ డైరక్టర్.. ఇప్పుడు తాజాగా తన సినిమా సంగతుల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. నితిన్-త్రివిక్రమ్ సినిమా పేరు అ..ఆ. ఇందులో అ అంటే అనసూయ రామలింగం. ఆ అంటే ఆనంద్ విహారి. ట్యాగ్ లైన్ గా అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అని పెట్టారు. ఈ సినిమాలో నితిన్ సరసన సమంత […]

 నితిన్-త్రివిక్రమ్ సినిమా పక్కా
X
ఎట్టకేలకు లాంగ్ గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా డీటెయిల్స్ ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. నితిన్ తో సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించిన ఈ స్టార్ డైరక్టర్.. ఇప్పుడు తాజాగా తన సినిమా సంగతుల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. నితిన్-త్రివిక్రమ్ సినిమా పేరు అ..ఆ. ఇందులో అ అంటే అనసూయ రామలింగం. ఆ అంటే ఆనంద్ విహారి. ట్యాగ్ లైన్ గా అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అని పెట్టారు. ఈ సినిమాలో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటించబోతోంది. మరో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. సినిమాను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను తెరకెక్కించిన హాసిని అండ్ హారిక క్రియేషన్స్ సంస్థే ఈ నయా మూవీని కూడా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి సినిమాను సిద్ధం చేయాలనుకుంటున్నారు.
First Published:  10 Sep 2015 7:05 PM GMT
Next Story