Telugu Global
Cinema & Entertainment

అప్పుడే మరో సినిమా మొదలుపెట్టాడు..

మంచు విష్ణు హీరోగా ఈమధ్యే డైనమేట్ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలై వారం కూడా కాకముందే అప్పుడే మరోసినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు ఈ మంచువారబ్బాయ్. గతంలోనే ప్రకటించిన విధంగా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ సిద్ధం చేశాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న రామానాయుడు స్టుడియోస్ లో ఘనంగా జరిగింది. కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెమిని కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్ కు దర్శకేంద్రుడు క్లాప్ కొడితే.. ఫస్ట్ షాట్ […]

అప్పుడే మరో సినిమా మొదలుపెట్టాడు..
X
మంచు విష్ణు హీరోగా ఈమధ్యే డైనమేట్ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలై వారం కూడా కాకముందే అప్పుడే మరోసినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు ఈ మంచువారబ్బాయ్. గతంలోనే ప్రకటించిన విధంగా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ సిద్ధం చేశాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న రామానాయుడు స్టుడియోస్ లో ఘనంగా జరిగింది. కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెమిని కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్ కు దర్శకేంద్రుడు క్లాప్ కొడితే.. ఫస్ట్ షాట్ కు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచే మొదలవుతుంది. ఏకథాటిగా సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన సోనారికా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై కుమార్, కేశవ్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ నాటికి సినిమాను సిద్ధం చేయాలనుకుంటున్నారు.
First Published:  10 Sept 2015 8:00 PM GMT
Next Story