Telugu Global
Others

ఎవరైనా హెల్మెట్ ధరించాల్సిందే : హైకోర్టు

ద్విచక్ర వాహనాలు నడిపే ఎవరైనా హెల్మెట్ ధరించాల్సిందే అని మద్రాసు హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో మహిళలు, పిల్లలకు మినహాయింపు లేదని పేర్కొంది. ఇది ప్రజా భద్రతకు సంబంధించిన అంశమని, అందరూ హెల్మెట్ ధరించక తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికే ఈ నిబంధనను 155 దేశాలు పాటిస్తున్నాయని జస్టిస్ ఎన్ కిరుబకరన్ తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడాన్ని సవాలు చేస్తూ […]

ద్విచక్ర వాహనాలు నడిపే ఎవరైనా హెల్మెట్ ధరించాల్సిందే అని మద్రాసు హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో మహిళలు, పిల్లలకు మినహాయింపు లేదని పేర్కొంది. ఇది ప్రజా భద్రతకు సంబంధించిన అంశమని, అందరూ హెల్మెట్ ధరించక తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికే ఈ నిబంధనను 155 దేశాలు పాటిస్తున్నాయని జస్టిస్ ఎన్ కిరుబకరన్ తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడాన్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలయింది. అయితే దీన్ని హైకోర్టు కొట్టి వేసింది.
First Published:  10 Sep 2015 1:12 PM GMT
Next Story