Telugu Global
Cinema & Entertainment

మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు

కామ్ గా తనపని తాను చేసుకుపోవడం అవసరాల శ్రీనివాస్ స్టయిల్. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆ ఆజానుబాహుడు, తర్వాత ఎవరూ ఊహించని విధంగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఏదో డైరక్షన్ పిచ్చి ఉండి అలా చేశాడేమో అనుకున్నారంతా. కానీ తొలి సినిమా ఊహలు గుసగుసలాడేతో మొత్తం ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. వెరీ లో-బడ్జెట్ తో తీసిన ఆ సినిమాతో హై-ప్రొఫైల్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేసేయాలని తొందరపడలేదు అవసరాల. మెల్లమెల్లగా కథ కోసం ప్రయత్నించాడు. […]

మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు
X
కామ్ గా తనపని తాను చేసుకుపోవడం అవసరాల శ్రీనివాస్ స్టయిల్. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆ ఆజానుబాహుడు, తర్వాత ఎవరూ ఊహించని విధంగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఏదో డైరక్షన్ పిచ్చి ఉండి అలా చేశాడేమో అనుకున్నారంతా. కానీ తొలి సినిమా ఊహలు గుసగుసలాడేతో మొత్తం ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. వెరీ లో-బడ్జెట్ తో తీసిన ఆ సినిమాతో హై-ప్రొఫైల్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేసేయాలని తొందరపడలేదు అవసరాల. మెల్లమెల్లగా కథ కోసం ప్రయత్నించాడు. చివరకు తన మనసులో అనుకున్న ఓ కాన్సెప్ట్ కు కథా రూపం ఇచ్చాడు. అలా వచ్చిందో జోఅచ్యుతానంద సినిమా. ఇద్దరు అన్నదమ్ములు, ఒక సోదరి మధ్య ఉండే అనుబంధంతో రాబోతున్న ఈ సినిమాను వినాయక చవితి రోజున ప్రారంభించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని సంగతులు చవితి రోజునే వెల్లడి కానున్నాయి.
First Published:  10 Sep 2015 7:03 PM GMT
Next Story