Telugu Global
NEWS

వినుడు..వినుడు..తెలుగోడు

త‌మిళ‌నాడు తెలుగోడి గోడు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వినిపించింది. త‌మిళ‌నాడులో ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచి ప‌దో త‌ర‌గ‌తిలో తెలుగు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాకు సీపీఐ జాతీయ నేత నారాయ‌ణ‌, సినీ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌తో పాటు రాజ‌కీయ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 2006లో క‌రుణానిధి హ‌యాంలో నిర్బంధ త‌మిళం […]

వినుడు..వినుడు..తెలుగోడు
X

త‌మిళ‌నాడు తెలుగోడి గోడు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వినిపించింది. త‌మిళ‌నాడులో ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచి ప‌దో త‌ర‌గ‌తిలో తెలుగు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాకు సీపీఐ జాతీయ నేత నారాయ‌ణ‌, సినీ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌తో పాటు రాజ‌కీయ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 2006లో క‌రుణానిధి హ‌యాంలో నిర్బంధ త‌మిళం అమ‌లుకు తీసుకొచ్చిన జీవో అమలుతోనే తెలుగు త‌మిళ‌నాడు నుంచి పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వ‌క్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిర్బంధ త‌మిళం అమ‌లుతో ఉన్న అర‌కొర తెలుగు స్కూళ్లు కూడా మూత‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని, మైనారిటీ భాష‌ల ర‌క్ష‌ణ‌కు ఆయా ప్రాంతాల సీఎంలు కృషి చేయాల‌ని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. త‌మిళ‌నాడు జ‌నాభాలో 27 శాతంగా ఉన్న తెలుగువాళ్ల‌కు త‌మ భాష‌లో చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పించేందుకు సీఎం జ‌య‌ల‌లిత‌తో తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, కేసీఆర్‌లు చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కోరారు.

First Published:  10 Sep 2015 8:01 AM GMT
Next Story