బాపురే డబ్బింగ్ చెప్పినందుకే కోటి రూపాయలా..?
అతిలోక సుందరి శ్రీదేవి తన సినిమా జీవితానికి పునాది వేసుకున్నది తెలుగునాటే. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. జన్మతహా తమిళనాడుకు చెందిన అమ్మాయి. అయినప్పటికి .. చిన్నప్పటి నుంచి ఇక్కడే చిత్రాలు చేస్తూ..ఇక్కడే హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చి..ఇక్కడే సూపర్ స్టార్ కావడంతో… శ్రీదేవి మన తెలుగుమ్మాయే అనుకుంటారు. ఇక తను సూపర్ స్టార్ గా ఎదగడంలో మన తెలుగు దిగ్ దర్శకుడు రాఘవేంద్రరావు కృషి ఎంతో వుంది. శ్రీదేవి బాలీవుడ్ లో ఎంట్రీ చేయించింది […]
అతిలోక సుందరి శ్రీదేవి తన సినిమా జీవితానికి పునాది వేసుకున్నది తెలుగునాటే. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. జన్మతహా తమిళనాడుకు చెందిన అమ్మాయి. అయినప్పటికి .. చిన్నప్పటి నుంచి ఇక్కడే చిత్రాలు చేస్తూ..ఇక్కడే హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చి..ఇక్కడే సూపర్ స్టార్ కావడంతో… శ్రీదేవి మన తెలుగుమ్మాయే అనుకుంటారు.
ఇక తను సూపర్ స్టార్ గా ఎదగడంలో మన తెలుగు దిగ్ దర్శకుడు రాఘవేంద్రరావు కృషి ఎంతో వుంది. శ్రీదేవి బాలీవుడ్ లో ఎంట్రీ చేయించింది కూడా రాఘవేంద్రుడు. తను తెలుగులో డైరెక్ట్ చేసిన దేవత సినిమాను ..హిందిలో హిమ్మత్ వాల పేరు తో రీమేక్ చేశారు. హీరోయిన్ గా శ్రీదేవి ని తీసుకుని..తనదైన మార్క్ అందాల ఎలివేషన్ బాలీవుడ్ ప్రేక్షకులకు చూపించారు. మొదటి చిత్రం నుంచే శ్రీదేవి బాలీవుడ్ లో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేక పోయిందంటే .. శ్రీదేవి అందం అంతగా అభిమానుల్ని ఇంప్రెస్ చేసి వుంటుందో ఊహించుకోవచ్చు. బి టౌన్ లో అడుగిడిన కొద్ది కాలంలోనే మాధురి దీక్షిత్ కు పక్కలో బల్లెంలా పోటి ఇచ్చింది. ఆఫ్ కోర్స్ కొంత కాలం ఆల్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకుంది. కట్ చేస్తే… పెళ్లి..పిల్లలు దాదాపు 14 సంవత్సరాల పాటు మేకప్ కు దూరంగా ఉంది.
ఈ మధ్య ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రంతో గ్రాండ్ రీ ఎంట్రి ఇచ్చింది. తన వయసుకు తగ్గ రోల్ చేసి మెప్పించారు. తాజాగా తమిళ హీరో విజయ్ సరసన పులి చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నారు. తమిళ్ తో పాటు..తెలుగులో విడుదలవుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి తన రోల్ కు డబ్బింగ్ చెప్పడానికి దాదాపు కోటి రూపాయాలు వసూలు చేశారట. ఈ వార్త నిజమైతే..డబ్బింగ్ కోసం కోటి రూపాయలు రెమ్యున్ రేషన్ తీసుకున్న నటిగా శ్రీదేవి రికార్డ్ కొట్టినట్లే అంటున్నారు. తెలుగులో పులి సినిమా రైట్స్ ను ప్రొడ్యూసర్ శోభరాణి తీసుకున్నారు. విజయ్ సరసన శృతిహాసన్, హన్సికలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తున్న పులి చిత్రంలో కీ రోల్ చేసిన శ్రీదేవి అద్భుతుంగా చేశారనే టాక్ వినిపిస్తుంది మరి.