Telugu Global
Others

మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్‌గిరీ ద‌క్కేనా?

మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు.. తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్!  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి  కేసీఆర్‌ ని అత్యంత ప‌రుష‌ప‌ద‌జాలంతో విమ‌ర్శించే ఏకైక వ్య‌క్తి. ఉద్య‌మ స‌మ‌యంలోనూ కేసీఆర్ ను విమ‌ర్శిస్తూ.. చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు కొట్టేసిన టీడీపీ నేత‌. ఉద్య‌మ ఉద్ధృతి చూసి కంగుతిని న‌ల్ల‌గొండ నుంచి పోటీకి వెన‌కంజ వేశారు. ఖ‌మ్మం జిల్లాలో  పోటీ చేసి భంగ‌ప‌డ్డారు. దీంతో చంద్ర‌న్న అభ‌య‌హ‌స్తం ఇచ్చారని, ఏదైనా చిన్న రాష్ర్టానికి గ‌వ‌ర్న‌ర్ గా పంపుతామ‌ని హామీ ఇచ్చారని ప్ర‌చారం సాగుతోంది. […]

మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్‌గిరీ ద‌క్కేనా?
X
మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు.. తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్! తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ని అత్యంత ప‌రుష‌ప‌ద‌జాలంతో విమ‌ర్శించే ఏకైక వ్య‌క్తి. ఉద్య‌మ స‌మ‌యంలోనూ కేసీఆర్ ను విమ‌ర్శిస్తూ.. చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు కొట్టేసిన టీడీపీ నేత‌. ఉద్య‌మ ఉద్ధృతి చూసి కంగుతిని న‌ల్ల‌గొండ నుంచి పోటీకి వెన‌కంజ వేశారు. ఖ‌మ్మం జిల్లాలో పోటీ చేసి భంగ‌ప‌డ్డారు. దీంతో చంద్ర‌న్న అభ‌య‌హ‌స్తం ఇచ్చారని, ఏదైనా చిన్న రాష్ర్టానికి గ‌వ‌ర్న‌ర్ గా పంపుతామ‌ని హామీ ఇచ్చారని ప్ర‌చారం సాగుతోంది. ఆ భ‌రోసాతోనే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌వి చూసినా ఆయ‌న తీరుమార్చుకోలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ టాక్ ఎప్ప‌టి నుంచో న‌డుస్తోంది. తెలంగాణ‌, ఏపీల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌ను మార్చాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఈ నెల 23 త‌రువాత ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌ను మార్పుపై ప్ర‌ధాని నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం. అలాగే ఏదైనా చిన్న రాష్ర్టానికి టీడీపీ సూచించిన వ్య‌క్తిని గ‌వ‌ర్న‌ర్గా పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిసింది.
టీడీపీ మాట నెగ్గుతుందా?
ఓటుకు నోటు కేసులో కూరుకుపోయిన చంద్ర‌బాబు రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదాను కేంద్రం వ‌ద్ద‌ తాక‌ట్టు పెట్టార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. కేంద్రం కూడా ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో కొన్నిరోజులుగా టీడీపీ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ లో ప‌డింది. ఇప్పుడు టీడీపీకి స‌మ‌యం క‌లిసి వ‌చ్చింది. తాము సూచించిన వ్య‌క్తికి గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇచ్చి వారి మైత్రి బ‌లంగానే ఉంద‌ని చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అయితే, మొద‌టి నుంచి తెలంగాణ‌పై చిన్న‌చూపు చూసే చంద్ర‌బాబు ఈ ప్రాంతం నేత‌లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తార‌ని ఇత‌ర పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఒక‌వేళ ప‌ద‌వి ఇప్పించి తెలంగాణ ప్రాంతంలో పార్టీ బ‌లోపేతానికి పాటుప‌డ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొత్తానికి నెలాఖ‌రునాటికి మోత్కుప‌ల్లి విష‌యంలో స్ప‌ష్ట‌త‌రానుంది.
First Published:  8 Sep 2015 11:51 PM GMT
Next Story