Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 200

ఉద్యోగం టీచర్‌: “చిన్నప్పుడు క్లాస్‌లో అస్తమానం అల్లరి చేస్తే మీ అబ్బాయిని బెంచి మీద నిలబెట్టేవాడ్ని. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నాడేంటి? శివరావు: “మీ దయ వల్ల వాడికి ట్రాఫిక్‌ పోలీసు ఉద్యోగం వచ్చింది.” ———————————————————————- చిందరవందర “అదేంటండి! అన్నీ చక్కగా సర్ది పెడితే గదంతా అలా చిందరవందర చేసేస్తున్నారు.” అడిగింది రమ. “ఈ మధ్య ఈ ఏరియాలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఒకవేళ ఏ దొంగన్నా వచ్చినా మన గది చూసి ఆల్‌రెడీ దొంగతనం జరిగిందనుకుని […]

ఉద్యోగం
టీచర్‌: “చిన్నప్పుడు క్లాస్‌లో అస్తమానం అల్లరి చేస్తే మీ అబ్బాయిని బెంచి మీద నిలబెట్టేవాడ్ని. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నాడేంటి?
శివరావు: “మీ దయ వల్ల వాడికి ట్రాఫిక్‌ పోలీసు ఉద్యోగం వచ్చింది.”
———————————————————————-
చిందరవందర
“అదేంటండి! అన్నీ చక్కగా సర్ది పెడితే గదంతా అలా చిందరవందర చేసేస్తున్నారు.” అడిగింది రమ.
“ఈ మధ్య ఈ ఏరియాలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఒకవేళ ఏ దొంగన్నా వచ్చినా మన గది చూసి ఆల్‌రెడీ దొంగతనం జరిగిందనుకుని వెళ్లిపోతాడు.” చెప్పాడు వెంకట్రావు.
———————————————————————-
షాపింగ్‌
“వాతావరణం అనుకూలిస్తే షాపింగ్‌ చేద్దామనుకుంటున్నాను. వాతావరణం గురించి పేపర్‌లో ఏం రాసారండి?” అడిగింది సునీత.
“పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందట…” చెప్పాడు సురేష్‌.

First Published:  8 Sep 2015 1:03 PM GMT
Next Story