Telugu Global
Others

తడిసి ముద్దయిన జంట నగరాలు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని రహదారులు జలమయమై కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. కార్యాలయాల పనివేళలు ముగియండంతో నగరవాసులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం అతికష్టంగా సాగుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చిక్కడపల్లి, శంకర్‌మఠ్‌రోడ్డు, జవహర్‌నగర్, అంబర్‌పేట, ప్యాట్నీ, ప్యారడైజ్, అడ్డగుట్ట, బేగంపేట, మారేడ్‌పల్లి, చిలకలగూడలో […]

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని రహదారులు జలమయమై కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. కార్యాలయాల పనివేళలు ముగియండంతో నగరవాసులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం అతికష్టంగా సాగుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చిక్కడపల్లి, శంకర్‌మఠ్‌రోడ్డు, జవహర్‌నగర్, అంబర్‌పేట, ప్యాట్నీ, ప్యారడైజ్, అడ్డగుట్ట, బేగంపేట, మారేడ్‌పల్లి, చిలకలగూడలో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లోని పార్శిగుట్టలో ఇళ్లలోకి చేరిన వరదనీరు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అప్రమత్తమైంది. 24 క్షేత్రస్థాయి అత్యవసర బృందాలు, 6 కేంద్ర కార్యాలయ అత్యవసర బృందాలతో పాటు మరో 51 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో వర్షాల పరిస్థితిని మంత్రి పద్మారావు పరిశీలిస్తున్నారు.
First Published:  8 Sep 2015 1:47 PM GMT
Next Story