Telugu Global
Others

రాజధాని నగరంలో రైతు ఆత్మహత్య!

ఇప్పటివరకు గ్రామాలకే పరిమితమైన తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు హైదరాబాద్‌కు పాకాయి. పంటనష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కన్నకొడుకు ఆరోగ్యం సరిగా లేదని మనస్థాపం చెందిన ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌ చిక్కడ్‌పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా సదాశివపేట మండలం రత్నాల రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల లింబయ్య అనే ఈ రైతు తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్నా చికిత్స చేయించలేక కుమిలిపోయాడు. అంతే రాజధాని నగరమైన హైదరాబాద్‌కు వచ్చి లోయర్‌ ట్యాంకుబండ్‌ కట్టమైసమ్మ […]

ఇప్పటివరకు గ్రామాలకే పరిమితమైన తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు హైదరాబాద్‌కు పాకాయి. పంటనష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కన్నకొడుకు ఆరోగ్యం సరిగా లేదని మనస్థాపం చెందిన ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌ చిక్కడ్‌పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా సదాశివపేట మండలం రత్నాల రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల లింబయ్య అనే ఈ రైతు తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్నా చికిత్స చేయించలేక కుమిలిపోయాడు. అంతే రాజధాని నగరమైన హైదరాబాద్‌కు వచ్చి లోయర్‌ ట్యాంకుబండ్‌ కట్టమైసమ్మ గుడి దగ్గర ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మొదట బస్సు కిందపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత ట్రాన్స్‌ఫారమ్‌కు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
First Published:  8 Sep 2015 1:22 PM GMT
Next Story