Telugu Global
Others

విదేశీ విద్య కోసం ఆప్‌ రుణ సదుపాయం

ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఆప్ ప్రభుత్వం భారీ రుణ సదుపాయం కల్పించే విదేశీ విద్యా రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యార్థులకు గరిష్టంగా రూ.10లక్షల వరకు రుణాన్ని అందించనున్నారు. ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా సెక్రటేరియట్‌లో కొంతమంది విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందించే ఈ రుణాలకు […]

ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఆప్ ప్రభుత్వం భారీ రుణ సదుపాయం కల్పించే విదేశీ విద్యా రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యార్థులకు గరిష్టంగా రూ.10లక్షల వరకు రుణాన్ని అందించనున్నారు. ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా సెక్రటేరియట్‌లో కొంతమంది విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందించే ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే షూరిటీగా ఉంటుందని, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తూ వారిని ఉన్నత విద్యనభ్యసించే దిశగా ముందుకు తీసుకుళ్లే ఉద్ధేశంతో ఆప్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థులకిచ్చే రుణంపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరని తెలిపారు. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరమైన సమస్యలతో తమ కలలను నెరవేర్చుకోలేక పోతున్నారని… వారి కలలను సాకారం చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే దేశంలో తొలిసారిగా ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
First Published:  8 Sep 2015 1:42 PM GMT
Next Story