Telugu Global
Cinema & Entertainment

రవితేజ మరో సినిమాకు రెడీ

కిక్-2 సినిమా మొత్తానికి చేదు అనుభవం మిగిల్చింది. నిర్మాతగా కల్యాణ్ రామ్ కు నష్టాలతో పాటు, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రవితేజకు ఫ్లాపు తెచ్చిపెట్టింది. ఆ దెబ్బ నుంచి కల్యాణ్ రామ్, సురేందర్ రెడ్డి కోలుకున్నారో లేదో తెలీదు కానీ రవితేజ మాత్రం వెంటనే అలెర్ట్ అయ్యాడు. ఏమాత్రం తడబడకుండా.. ఫ్లాపు ఛాయలు కనిపించనీయకుండా వెంటనే తన పనిలో తాను మునిగిపోయాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న బెంగాల్ టైగర్ సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు మాస్ […]

రవితేజ మరో సినిమాకు రెడీ
X
కిక్-2 సినిమా మొత్తానికి చేదు అనుభవం మిగిల్చింది. నిర్మాతగా కల్యాణ్ రామ్ కు నష్టాలతో పాటు, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రవితేజకు ఫ్లాపు తెచ్చిపెట్టింది. ఆ దెబ్బ నుంచి కల్యాణ్ రామ్, సురేందర్ రెడ్డి కోలుకున్నారో లేదో తెలీదు కానీ రవితేజ మాత్రం వెంటనే అలెర్ట్ అయ్యాడు. ఏమాత్రం తడబడకుండా.. ఫ్లాపు ఛాయలు కనిపించనీయకుండా వెంటనే తన పనిలో తాను మునిగిపోయాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న బెంగాల్ టైగర్ సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు మాస్ రాజా. కిక్-2 గాయాలు మానాలంటే వెంటనే బెంగాల్ టైగర్ తో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాతోపాటు మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడ్డాడు రవితేజ. దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథకు దాదాపు ఓకే చెప్పాడు. గతంలో ఓ మైఫ్రెండ్ లాంటి సినిమా తీశాడు వేణుశ్రీరామ్. తాజాగా బెంగళూర్ డేస్ సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకున్నప్పటికీ.. నటీనటులు కుదరక ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టాడు. ఇప్పుడు రవితేజను మరో ఫ్రెష్ స్టోరీతో ఒప్పించాడు. బెంగాల్ టైగర్ పూర్తయిన వెంటనే వేణుశ్రీరామ్-మాస్ రాజా కాంబోలో సినిమా సెట్స్ పైకి వస్తుంది.
First Published:  7 Sep 2015 8:00 PM GMT
Next Story