Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 199

ఐడియా “అరేయ్‌! మనం రోజూ ఈ వెధవ బస్సుల్లో ఫుట్‌బోర్డుల మీద వేల్లాడుతూ వెళ్లకుండా ఎంచక్కా కూర్చుని వెళ్లడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.” “ఏంట్రా అది?” “బస్‌ డ్రైవర్‌గా జాయిన్‌ అయిపోవడమే!!” ————————————————————————- సంబంధం “పంతులూ! మరీ రావణాసురుడిలాంటి అబ్బాయిని చూశావేంటయ్యా? అమ్మాయి సుఖపడుతుందంటావా?” “మీరే కదండీ..! లంకంత కొంప ఉన్నవాడు కావాలన్నారు మరి!!!” ————————————————————————- కొంచెం “అదేంట్రా! ఈయన పెళ్లి భోజనాలు ఇంత కొంచెం పెడుతున్నాడు?” “ఆయన గుళ్లో పూజారి. ప్రసాదం పెట్టినట్టే […]

ఐడియా
“అరేయ్‌! మనం రోజూ ఈ వెధవ బస్సుల్లో ఫుట్‌బోర్డుల మీద వేల్లాడుతూ వెళ్లకుండా ఎంచక్కా కూర్చుని వెళ్లడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.”
“ఏంట్రా అది?”
“బస్‌ డ్రైవర్‌గా జాయిన్‌ అయిపోవడమే!!”
————————————————————————-
సంబంధం
“పంతులూ! మరీ రావణాసురుడిలాంటి అబ్బాయిని చూశావేంటయ్యా? అమ్మాయి సుఖపడుతుందంటావా?”
“మీరే కదండీ..! లంకంత కొంప ఉన్నవాడు కావాలన్నారు మరి!!!”
————————————————————————-
కొంచెం
“అదేంట్రా! ఈయన పెళ్లి భోజనాలు ఇంత కొంచెం పెడుతున్నాడు?”
“ఆయన గుళ్లో పూజారి. ప్రసాదం పెట్టినట్టే భోజనమూ పెడుతున్నాడు!!”

First Published:  7 Sep 2015 1:03 PM GMT
Next Story