Telugu Global
Cinema & Entertainment

బాహుబలి 2 తరువాత ఈగ 2..?

ప్రస్తుత్తం బాహుబ‌లి 2 చిత్రీకరణ, రిలీజ్ తదితర అంశాలపై తెగ బిజిబిజీగా ఉన్న రాజమౌళీ ఆ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉంద‌న్న‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే ఈ ప్రచారం పై అటు జ‌క్క‌న్న‌, ఇటు మ‌హేష్ ఇద్దరు ఈ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా ధృవీక‌రించారు. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కేఎల్‌.నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తార‌ని కూడా జ‌క్క‌న్న చెప్పారు. అయితే సినిమా ఎప్పుడు ఉండ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని మాత్రం ఎవ్వ‌రు […]

బాహుబలి 2 తరువాత ఈగ 2..?
X

ప్రస్తుత్తం బాహుబ‌లి 2 చిత్రీకరణ, రిలీజ్ తదితర అంశాలపై తెగ బిజిబిజీగా ఉన్న రాజమౌళీ ఆ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉంద‌న్న‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే ఈ ప్రచారం పై అటు జ‌క్క‌న్న‌, ఇటు మ‌హేష్ ఇద్దరు ఈ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా ధృవీక‌రించారు. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కేఎల్‌.నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తార‌ని కూడా జ‌క్క‌న్న చెప్పారు. అయితే సినిమా ఎప్పుడు ఉండ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని మాత్రం ఎవ్వ‌రు నిర్దారించ‌లేదు. దీనితో పాటు బాహుబ‌లి 2 త‌ర్వాత జ‌క్క‌న్న కోలీవుడ్ హీరో అజిత్‌, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇవి ఇలా ఉండగా ఈ మధ్య నాని మరో కొత్త విషయం చెప్పుకొచ్చాడు. బాహుబలి2 తరువాత ఈగ 2 వస్తుందని, దీనిపై కూడా జక్కన్న కసరత్తు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఒక వేళ ఇదే నిజమైతే మహేష్, రాజమౌళీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకోసం ఎంతలేదన్న మరో 2 నుంచి 3 సంవత్సరాలు ఆగాల్సిందే…. ఈగ 2 కోసం కొత్త హిరోలుగా ఉన్న మనీష్, తనీష్, హర్షవర్ధన్ వంటి వారిని తీసుకోనే ఆలోచనలో ఉన్నటు ఫిలిం నగర్ సమాచార‍ం.

First Published:  7 Sep 2015 9:03 PM GMT
Next Story