Telugu Global
National

ముందే రిటైరైనా ఓఆర్వోపీ వర్తింపు: మోడి

మాజీ సైనికులకు ప్రభుత్వం అమలు చేయనున్న ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్ (ఓఆర్వోపీ) పథకంపై నెలకొన్న అనుమానాలను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నివృత్తి చేశారు. తమ సర్వీసు కాలం ముగియక ముందే పదవీ విరమణ చేసిన సైనికులకు కూడా ఓఆర్వోపీ పథకాన్ని అమలు చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తరువాతనే ఆందోళన విరమిస్తామని మాజీ సైనికులు చెప్పారు. ప్రస్తుతానికి ఆమరణ నిరాహారదీక్ష విరమిస్తున్నామని, ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో […]

ముందే రిటైరైనా ఓఆర్వోపీ వర్తింపు: మోడి
X
మాజీ సైనికులకు ప్రభుత్వం అమలు చేయనున్న ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్ (ఓఆర్వోపీ) పథకంపై నెలకొన్న అనుమానాలను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నివృత్తి చేశారు. తమ సర్వీసు కాలం ముగియక ముందే పదవీ విరమణ చేసిన సైనికులకు కూడా ఓఆర్వోపీ పథకాన్ని అమలు చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తరువాతనే ఆందోళన విరమిస్తామని మాజీ సైనికులు చెప్పారు. ప్రస్తుతానికి ఆమరణ నిరాహారదీక్ష విరమిస్తున్నామని, ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో వికలాంగులైన వారికి కూడా ఓఆర్వోపీ పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పారు. పథకం అమలుచేయడంలో వచ్చే చిక్కులన్నింటినీ అధ్యయనం చేశామని చెప్పారు. 15-16 ఏండ్లు సైన్యంలో సేవలందించిన తరువాత బలవంతంగా సైన్యాన్ని వీడాల్సి వచ్చిన వారికి కూడా ఓఆర్వోపీని అమలు చేస్తామని పేర్కొన్నారు.
First Published:  7 Sep 2015 2:29 AM GMT
Next Story