Telugu Global
Cinema & Entertainment

  మంచు విష్ణు సరసన కాజల్?

ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ కాజల్ అనే చెప్పాలి. కానీ ఎంత స్టార్ డమ్ తగ్గినప్పటికీ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాల్షీట్లు ఇస్తూవచ్చింది ఈ కలువకళ్ల భామ. అయితే తొలిసారి మంచు విష్ణు సినిమాకు కాల్షీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరో 3 రోజుల్లో కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేస్తాడు మంచు విష్ణు. సెప్టెంబర్ 10న ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారు. జాదుగాడు సినిమాలో నటించిన […]

  మంచు విష్ణు సరసన కాజల్?
X
ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ కాజల్ అనే చెప్పాలి. కానీ ఎంత స్టార్ డమ్ తగ్గినప్పటికీ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాల్షీట్లు ఇస్తూవచ్చింది ఈ కలువకళ్ల భామ. అయితే తొలిసారి మంచు విష్ణు సినిమాకు కాల్షీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరో 3 రోజుల్లో కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేస్తాడు మంచు విష్ణు. సెప్టెంబర్ 10న ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారు. జాదుగాడు సినిమాలో నటించిన సోనారికాను హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే ఇదే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కాజల్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. జస్ట్ 10 రోజుల కాల్షీట్లు ఇస్తే ఆ క్యారెక్టర్ పని అయిపోతుంది. ఈ 10 రోజుల కాల్షీట్ కు కాజల్ కు 40లక్షల రూపాయలిచ్చేందుకు ముందుకొచ్చారు నిర్మాతలు. కాజల్ కూడా మంచు విష్ణు సరసన నటించేందుకు సముఖంగానే ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే నటించడానికి అవకాశముండే ఈ పాత్ర కోసం కాజల్ తో పాటు అమలా పాల్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు కాజల్ కు కాస్త చిరాకు తెప్పిస్తోంది.
First Published:  6 Sep 2015 7:00 PM GMT
Next Story