Telugu Global
Others

నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టెక్ మహేంద్ర ఫౌండేషన్, యుగాంతర్ సంస్థతో కలిసి 3 నెలల పాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని యుగాంతర్ సంస్థ మొబిలైజేషన్ కో ఆర్డినేటర్ నిరంజన్ యాదవ్ పేర్కొన్నారు. బికాం ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతి, యువకులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణలో ప్రధానంగా స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ట్యాలీ, ఇఆర్‌పి […]

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టెక్ మహేంద్ర ఫౌండేషన్, యుగాంతర్ సంస్థతో కలిసి 3 నెలల పాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని యుగాంతర్ సంస్థ మొబిలైజేషన్ కో ఆర్డినేటర్ నిరంజన్ యాదవ్ పేర్కొన్నారు. బికాం ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతి, యువకులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణలో ప్రధానంగా స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ట్యాలీ, ఇఆర్‌పి 9, బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సల్ తదితర కోర్సులలో ఉచిత శిక్షణను ఇవ్వడమే కాకుండా అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 8వ తేదీలోగా కోఠి ఇసామియాబజార్‌లోని కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
First Published:  5 Sep 2015 1:07 PM GMT
Next Story