Telugu Global
Others

కొలిక్కి వస్తున్న షీనా బోరా కేసు

ఆర్థిక సంబంధాలే పేగు బంధాన్ని తెంచేశాయి. సంచలనం సృష్టించిన షీనాబోరా క్రూరమైన హత్య కేసులో పోలీసులు తవ్వినకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. పది రోజులుగా విచారణకు సహకరించని ఇంద్రాణి ముఖర్జి నోరు విప్పడంతో నమ్మలేని సత్యాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పక్కాసాక్ష్యాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తరహాలో కొన్ని రోజులుగా నడుస్తున్న ముంబాయిలోని షీనాబోరా మర్డర్‌ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో కీలకం […]

కొలిక్కి వస్తున్న షీనా బోరా కేసు
X

ఆర్థిక సంబంధాలే పేగు బంధాన్ని తెంచేశాయి. సంచలనం సృష్టించిన షీనాబోరా క్రూరమైన హత్య కేసులో పోలీసులు తవ్వినకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. పది రోజులుగా విచారణకు సహకరించని ఇంద్రాణి ముఖర్జి నోరు విప్పడంతో నమ్మలేని సత్యాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పక్కాసాక్ష్యాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తరహాలో కొన్ని రోజులుగా నడుస్తున్న ముంబాయిలోని షీనాబోరా మర్డర్‌ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో కీలకం ఇంద్రాణి స్టేట్‌మెంట్ దీంతో ఈకేసు ఇప్పుడిప్పుడే చిక్కుముడి వీడుతోంది. ఎట్టకేలకు నేరం తానే చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ అంగీకరించడంతో ఇక పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దర్యాప్తులో వేగం పెంచారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పక్కా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు…ఇప్పటికే హత్యకు గురయిన షీనా బోరాను ఎక్కడ పాతిపెట్టారో గుర్తించిన అధికారులు ఆ ఎముకలకు పరీక్షలు నిర్వహించారు. పాతికేళ్ల యువతి ఎముకలుగా నిపుణులు నిర్థారించారు. మరింత ఖచ్చితత్వం కోసం ముంబై పోలీసులు వాటిని హైదారాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్‌కు తరలించారు.
షీనాబోరాకు నాలుగు సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లు..
మరోవైపు పోలీసులు షీనా మర్డర్‌కు దారి తీసిన పరిస్థితులపై దృష్టిని పెట్టారు. ఆమెను ఎందుకు చంపారు..? క్రూరంగా చంపి ఆ తర్వాత విదేశాల్లో బతికే ఉన్నట్లు ఎందుకు నమ్మించారు… ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉంది..? అసలు షీనాను హత్య చేయడానికి కారణాలేంటన్న విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంద్రాణి ముఖర్జీ నేరం అంగీకరించడంతో హత్యకు గల కారణాలు వెలికితీసే పనిలో పడ్డారు. ఇప్పటికే కుటుంబంలోని అందరినీ విచారించి నిజాలు రాబట్టిన పోలీసులు వివరాలన్నీ తెలిసినప్పటికీ మరింత క్లారిటీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇంద్రాణి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు షీనా బోరా నాలుగు బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. అందులో ఉన్న నగదు… ఇతర లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఆర్థిక సంబంధాలతోనే షీనాను అంతం చేసినట్లు ఇప్పటికే దాదాపు నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ కోణంలో మరిన్ని రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో మలుపులు తిరుగుతున్న షీనా బోరా హత్య కేసులో ఇంకేమీ అరెస్ట్‌లు ఉండకపోవచ్చన్నది పోలీసుల వర్గాల కథనం.

First Published:  6 Sep 2015 1:14 AM GMT
Next Story