ఆ ప్రకటనలకు దూరమంటున్న సచిన్
తన మూడు దశాబ్దాల అత్యుత్తమ కెరీర్‌లో ఎప్పుడూ పొగాకు, మద్యం బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించలేదని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. తన తండ్రి సూచనల మేరకు పొగ తాగే ప్రకటనలు, మద్యం సేవించే అడ్వర్జయిజ్‌మెంట్లులో తాను ఒక్కసారిగా కూడా నటించలేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ సమావేశం కేరళ రాష్ర్టం కోచిలో నిర్వహించారు. ఆత్మవిశ్వాసంతో ఆడాలేగానీ..ఆడేందుకు ఇతర పద్ధతులను ఆశ్రయించడం సరైంది కాదని సచిన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన […]
BY admin5 Sep 2015 8:05 PM GMT

X
admin5 Sep 2015 8:05 PM GMT
తన మూడు దశాబ్దాల అత్యుత్తమ కెరీర్‌లో ఎప్పుడూ పొగాకు, మద్యం బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించలేదని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. తన తండ్రి సూచనల మేరకు పొగ తాగే ప్రకటనలు, మద్యం సేవించే అడ్వర్జయిజ్‌మెంట్లులో తాను ఒక్కసారిగా కూడా నటించలేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ సమావేశం కేరళ రాష్ర్టం కోచిలో నిర్వహించారు. ఆత్మవిశ్వాసంతో ఆడాలేగానీ..ఆడేందుకు ఇతర పద్ధతులను ఆశ్రయించడం సరైంది కాదని సచిన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన సచిన్..తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రకటనలకు దూరంగా ఉంటున్నాడు. ఎంతైనా మాస్టర్‌బ్లాస్టర్ కదా!
Next Story