Telugu Global
Cinema & Entertainment

నాలుగు భాష‌ల్లో వ‌స్తున్న రెడ్ అల‌ర్ట్...!

డైరెక్ట‌ర్ చంద్ర మ‌హేష్ అంటే శ్రీ‌కాంత్ , రాసి, పృధ్విరాజ్ లీడ్ రోల్స్ లో చేసిన ప్రేయ‌సి రావే చిత్రం గుర్తుకు వ‌స్తుంది. మంచి క‌థ బ‌లం, సెంటిమెంట్ , త్యాగం వంటి అంశాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించింది. ద‌ర్శ‌కుడిగా చంద్ర మ‌హేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర‌వాత డైరెక్ట‌ర్ చంద్ర మ‌హేష్ కు అంత పేరు తెచ్చిన చిత్రం రాలేద‌నే చెప్పాలి. అయితే ట్రాక్ వ‌ద‌ల‌కుండా త‌న […]

నాలుగు భాష‌ల్లో వ‌స్తున్న రెడ్ అల‌ర్ట్...!
X
డైరెక్ట‌ర్ చంద్ర మ‌హేష్ అంటే శ్రీ‌కాంత్ , రాసి, పృధ్విరాజ్ లీడ్ రోల్స్ లో చేసిన ప్రేయ‌సి రావే చిత్రం గుర్తుకు వ‌స్తుంది. మంచి క‌థ బ‌లం, సెంటిమెంట్ , త్యాగం వంటి అంశాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించింది. ద‌ర్శ‌కుడిగా చంద్ర మ‌హేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర‌వాత డైరెక్ట‌ర్ చంద్ర మ‌హేష్ కు అంత పేరు తెచ్చిన చిత్రం రాలేద‌నే చెప్పాలి. అయితే ట్రాక్ వ‌ద‌ల‌కుండా త‌న స‌త్తాను చాటుకోవ‌డానికి పోరాడుతునే వున్నాడు…

ప్ర‌స్తుతం కొత్త వాళ్ల‌తో రెడ్ అల‌ర్ట్ పేరు తో ఒక చిత్రం చేస్తున్నాడు. మ‌హదేవ్ , అంజ‌న మీన‌న్ అనే కొత్త జంట‌తో ఈ చిత్రం చే్స్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు.. ద‌క్షిణాది భాషాల‌న్నింటిలో చేస్తుండ‌టం విశేషం. ఏక కాలంలో నాలుగు భాష‌ల్లో ఈ సినిమా చేయ‌డం ఒక రికార్డ్ గా న‌మోదు అయ్యింది. అల్రేడి క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో సినిమాను రిలీజ్ చేశారు. ఆ రెండు భాష‌ల్లో హిట్ తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా స‌క్సెస్ పై చంద్ర మ‌హేష్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఆయ‌న డ్రీమ్ నిజం కావాల‌ని ఆశిద్దాం.
Next Story