Telugu Global
Others

ఒరిస్సాలో వీలర్‌ ఐలాండ్‌కు కలాం పేరు

ఒడిషాలో ఉన్న ప్రముఖ వీలర్ ఐలాండ్‌కు అబ్దుల్ కలాం పేరును పెడుతున్నట్టు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిషాలో ఉన్న వీలర్ ఐలాండ్‌ను తీర్చిదిద్దడంలో కలాం చేసిన కృషిని మరచి పోలేమని అన్నారు. వీలర్ ఐలాండ్‌ను భారత దేశ క్షిపణి ప్రయోగాల వేదికగా మార్చిన ఘనత కలాందేనని.. ఒడిషాకే తలమానికంగా వీలర్‌ ఐలాండ్‌ను మార్చారన్నారు. అందుకే కలాంకు నివాళులర్పించే రీతిలో ఐలాండ్‌కు ఆయన పేరు పెట్టామన్నారు. ఇలా ఒడిషా ప్రభుత్వం […]

ఒరిస్సాలో వీలర్‌ ఐలాండ్‌కు కలాం పేరు
X
ఒడిషాలో ఉన్న ప్రముఖ వీలర్ ఐలాండ్‌కు అబ్దుల్ కలాం పేరును పెడుతున్నట్టు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిషాలో ఉన్న వీలర్ ఐలాండ్‌ను తీర్చిదిద్దడంలో కలాం చేసిన కృషిని మరచి పోలేమని అన్నారు. వీలర్ ఐలాండ్‌ను భారత దేశ క్షిపణి ప్రయోగాల వేదికగా మార్చిన ఘనత కలాందేనని.. ఒడిషాకే తలమానికంగా వీలర్‌ ఐలాండ్‌ను మార్చారన్నారు. అందుకే కలాంకు నివాళులర్పించే రీతిలో ఐలాండ్‌కు ఆయన పేరు పెట్టామన్నారు. ఇలా ఒడిషా ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవాన్ని అందిస్తూ నివాళి అర్పించింది.
First Published:  5 Sep 2015 1:11 PM GMT
Next Story