Telugu Global
Others

విద్యావ్యవస్థలో సమూల మార్పులు: కడియం

తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అవి త్వరలోనే అమలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. సామాజిక రుగ్మతలు రూపు మాపాలన్నా, సమాజంలో జీవన స్థితిగతులు మారాలన్నా విద్య చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయన హితవు చెప్పారు. ఈ సందర్భంగా […]

తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అవి త్వరలోనే అమలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. సామాజిక రుగ్మతలు రూపు మాపాలన్నా, సమాజంలో జీవన స్థితిగతులు మారాలన్నా విద్య చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయన హితవు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు.
First Published:  4 Sep 2015 1:19 PM GMT
Next Story