Telugu Global
Others

సూసైడ్‌ నోట్‌లో రైటింగ్‌ రిషితేశ్వరిదే: ఎఫ్‌ఎస్‌ఎల్‌

నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో సూసైడ్ నోట్ ఒరిజినలే అని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ ధ్రువీకరించింది. సూసైడ్ నోట్‌లోనూ, నోటు పుస్తకాల్లోని రాత ఒకేలా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో సూసైడ్ నోట్ అసలైనది కాదని వాదిస్తున్న నిందితుల నోళ్లకు మూత పడింది. ప్రాసిక్యూషన్‌కు కీలకమైన మరో సాక్ష్యం లభించినట్లయింది. రిషితేశ్వరి డైరీలు, ఆమె నోట్ పుస్తకాలు, సూసైడ్ నోట్‌లోని హ్యాండ్ రైటింగ్‌ను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి సూసైడ్ నోట్ రిషితేశ్వరి […]

నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో సూసైడ్ నోట్ ఒరిజినలే అని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ ధ్రువీకరించింది. సూసైడ్ నోట్‌లోనూ, నోటు పుస్తకాల్లోని రాత ఒకేలా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో సూసైడ్ నోట్ అసలైనది కాదని వాదిస్తున్న నిందితుల నోళ్లకు మూత పడింది. ప్రాసిక్యూషన్‌కు కీలకమైన మరో సాక్ష్యం లభించినట్లయింది. రిషితేశ్వరి డైరీలు, ఆమె నోట్ పుస్తకాలు, సూసైడ్ నోట్‌లోని హ్యాండ్ రైటింగ్‌ను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి సూసైడ్ నోట్ రిషితేశ్వరి స్వయంగా రాసిందే అని నిర్ధారించారు. ఈ విషయంలో అనుమానాలకు తెరదించారు.
First Published:  4 Sep 2015 1:17 PM GMT
Next Story