Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 196

ఉత్తరం తొలిరోజు స్కూలుకొచ్చిన స్టూడెంట్‌ టీచర్‌కు ఓ ఉత్తరం ఇచ్చాడు. అందులో ఇలా ఉంది. “ఈ అబ్బాయి వ్యక్తపరిచే అభిప్రాయాలు కేవలం అతడివే. దాంతో మాకెలాంటి సంబంధం లేదు” అని రాసి ఉంది. ‘ఈ ఉత్తరం ఎవరిచ్చారు’ అని అడిగింది టీచర్‌ ఆ స్టూడెంట్‌ని. ‘మా మమ్మీ!’ టీచర్‌ అన్నాడు ఆ విద్యార్థి. ‘మీ మమ్మీ ఏం చేస్తుంది!’ అంది టీచర్‌ ‘నవలలు రాస్తుంది’ అన్నాడు. ———————————————————————————————- మార్పు రంజిత్‌ కాన్ఫరెన్స్‌ హాల్లోకి అడుగుపెడుతూనే సాయి ‘హలో’ […]

ఉత్తరం
తొలిరోజు స్కూలుకొచ్చిన స్టూడెంట్‌ టీచర్‌కు ఓ ఉత్తరం ఇచ్చాడు. అందులో ఇలా ఉంది.
“ఈ అబ్బాయి వ్యక్తపరిచే అభిప్రాయాలు కేవలం అతడివే. దాంతో మాకెలాంటి సంబంధం లేదు” అని రాసి ఉంది.
‘ఈ ఉత్తరం ఎవరిచ్చారు’ అని అడిగింది టీచర్‌ ఆ స్టూడెంట్‌ని.
‘మా మమ్మీ!’ టీచర్‌ అన్నాడు ఆ విద్యార్థి.
‘మీ మమ్మీ ఏం చేస్తుంది!’ అంది టీచర్‌
‘నవలలు రాస్తుంది’ అన్నాడు.
———————————————————————————————-
మార్పు
రంజిత్‌ కాన్ఫరెన్స్‌ హాల్లోకి అడుగుపెడుతూనే సాయి ‘హలో’ అన్నాడు.
రంజిత్‌: మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు అన్నాడు.
సాయి: అరే! మీసాలు తీసేశావు. బట్టతల వచ్చింది. అద్దాలు వచ్చాయి. కొంచెం పొడవు పెరిగావు. అరే నన్ను గుర్తుపట్టలేదా సుధాకర్‌!
రంజిత్‌: నా పేరు సుధాకర్‌ కాదు, రంజిత్‌!
సాయి: అరే! పేరు కూడా మారిందే!
———————————————————————————————-
చేపలకు గేలం
పిచ్చాసుపత్రి కాంపౌండు లోపల ఉన్న పూల మొక్కల్లో గేలమేసి ఒక పిచ్చివాడు కూర్చున్నాడు.
అటు వైపు వచ్చిన డాక్టర్‌ సరదాగా “అవునయ్యా! పొద్దుట్నించి గాలమేసి కూర్చున్నావు కదా! ఎన్ని చేపలు పడ్డాయి!” అని అడిగాడు.
పిచ్చివాడు డాక్టర్ని చూసి “నీతో కలిపి తొమ్మిది” అన్నాడు.

First Published:  4 Sep 2015 1:03 PM GMT
Next Story