Telugu Global
Others

రాజీవ్ రహదారి పొడిగింపునకు శ్రీకారం

రాజీవ్ రహదారి పొడిగింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ఱ రాజధాని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ఈ రహదారిని పొడిగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు చాలా ఏండ్లుగా కోరుతున్నారు. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ విభాగం రోడ్డు పొడిగింపు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన ప్రభుత్వం దీనిపై వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కోసం కన్సెల్టెన్సీని నియమించడానికి అధికారులకు అనుమతి ఇచ్చింది. సంబంధిత ఉత్తర్వులను రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ […]

రాజీవ్ రహదారి పొడిగింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ఱ రాజధాని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ఈ రహదారిని పొడిగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు చాలా ఏండ్లుగా కోరుతున్నారు. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ విభాగం రోడ్డు పొడిగింపు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన ప్రభుత్వం దీనిపై వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కోసం కన్సెల్టెన్సీని నియమించడానికి అధికారులకు అనుమతి ఇచ్చింది. సంబంధిత ఉత్తర్వులను రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం జారీచేశారు. డీపీఆర్ కోసం రూ.1.75 కోట్లు కేటాయించారు. డీపీఆర్ తయారీకి బిడ్‌లు ఆహ్వానించగా మూడు కంపెనీలు ముందుకువచ్చాయి. వాటిలో ఒక కంపెనీని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ రహదారి ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్డు వరకు 252 కిలోమీటర్ల మేర ఉంది. ఇందారం వద్ద ఇది నేషనల్ హైవే 63తో కనెక్టయి ఆగిపోయింది. ప్రజల విజ్ఞప్తి మేరకు దీనిని మరో 90 కిలోమీటర్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొడిగింపు పూర్తయితే రాజీవ్ రహదారి మొత్తం పొడవు 342 కిలోమీటర్లు అవుతుంది.
First Published:  4 Sep 2015 1:07 PM GMT
Next Story