Telugu Global
Cinema & Entertainment

కొరియ‌ర్ బాయ్  ను ఫిక్స్ చేశారు..

ఇష్క్ చిత్రంతో స‌క్సెస్ తో   ఆక్సిజ‌న్  అందుకున్న  హీరో నితిన్  వ‌ర‌స స‌క్సెస్ ల‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  ప్ర‌స్తుతం  కొరియ‌ర్ బాయ్ చిత్రంతో  అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతున్నాడు.  ఇష్క్ చిత్రం త‌రువాత పూర్తి స్థాయి యాక్ష‌న్ చిత్రాల‌కు బై చెప్పిన‌..మ్యాగ్జిమ‌మ్  ల‌వ‌ర్ బాయ్ గా  ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సారి   కొరియ‌ర్ బాయ్ చిత్రంలో  ల‌వ్ తో పాటు..  యాక్ష‌న్ ను కూడా  ద‌ట్టించి  కొత్త ద‌ర్శ‌కుడు  ప్రేమ్ సాయ్ […]

కొరియ‌ర్ బాయ్  ను ఫిక్స్ చేశారు..
X
ఇష్క్ చిత్రంతో స‌క్సెస్ తో ఆక్సిజ‌న్ అందుకున్న హీరో నితిన్ వ‌ర‌స స‌క్సెస్ ల‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్ర‌స్తుతం కొరియ‌ర్ బాయ్ చిత్రంతో అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతున్నాడు. ఇష్క్ చిత్రం త‌రువాత పూర్తి స్థాయి యాక్ష‌న్ చిత్రాల‌కు బై చెప్పిన‌..మ్యాగ్జిమ‌మ్ ల‌వ‌ర్ బాయ్ గా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సారి కొరియ‌ర్ బాయ్ చిత్రంలో ల‌వ్ తో పాటు.. యాక్ష‌న్ ను కూడా ద‌ట్టించి కొత్త ద‌ర్శ‌కుడు ప్రేమ్ సాయ్ రూపొందించాడు. దాదాపు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం క్రితం ప్రారంభ‌మైన ఈ చిత్రం తెలుగు తో పాటు.. త‌మిళ్ లో కూడా స‌మాంత‌రంగా తెర‌కెక్కుతుంది.తెలుగులో నితిన్ చేస్తుండ‌గా.. త‌మిళ్ లో యువ హీరో జీవా చేస్తున్నాడు.
జీవా డేట్స్ బిజీ కార‌ణంగా సినిమా రిలీజ్ డిలే అయిన‌ట్లు..ఈ మ‌ధ్య ఈ చిత్రం ఆడియో విడుద‌ల వేడుక‌లో కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ చిత్ర నిర్మాత గౌత‌మ్ మీన‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే.ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ ను వ‌చ్చే శుక్ర‌వారం రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. డేట్ చెప్ప‌కుండా..ఈ వారం విడుద‌ల అంటూ ఈ రోజు ప్ర‌ముఖ వార్త ప‌త్రిక‌ల సినిమా పేప‌ర్స్ లో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. సో మ్యాగ్జిమ‌మ్ వ‌చ్చే శుక్ర‌వారం అంటే ఈ నె ల 11 వ తేదిన రిలీజ్ కాబోతుంది అన్నమాట‌.
Next Story