Telugu Global
Others

వరంగల్‌లో పోటీకి గద్దర్ సుముఖం: తమ్మినేని

వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీచేసేందుకు గద్దర్ సుముఖంగానే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వరంగల్ ఉపఎన్నికలో ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. గద్దర్ వరంగల్ స్థానానికి పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పారని తమ్మినేని తెలిపారు.

First Published:  3 Sep 2015 1:25 PM GMT
Next Story