Telugu Global
Cinema & Entertainment

డైనమైట్ మూవీ రివ్యూ

రేటింగ్.3/5 విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015 దర్శకత్వం : దేవ కట్టా నిర్మాత : మంచు విష్ణు సంగీతం : అచ్చు నటీనటులు : మంచు విష్ణు, ప్రణిత సుభాష్, జెడి చక్రవర్తి.. రవిప్ర‌కాష్‌, నాగినీడు సరికొత్త కథ, ఆ కథలో మునుపెన్నడూ చేయని పాత్ర, ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే లుక్ ఈ మూడింటిని పక్కాగా ప్రతి ఒక్క సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే యంగ్ హీరో మంచు విష్ణు […]

డైనమైట్ మూవీ రివ్యూ
X

రేటింగ్.3/5
విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015
దర్శకత్వం : దేవ కట్టా
నిర్మాత : మంచు విష్ణు
సంగీతం : అచ్చు

నటీనటులు : మంచు విష్ణు, ప్రణిత సుభాష్, జెడి చక్రవర్తి.. రవిప్ర‌కాష్‌, నాగినీడు

సరికొత్త కథ, ఆ కథలో మునుపెన్నడూ చేయని పాత్ర, ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే లుక్ ఈ మూడింటిని పక్కాగా ప్రతి ఒక్క సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. రియ‌లిస్టిక్ అనిపించే విధంగా చేసిన ఈ చిత్రం ఏ మేర‌కు ఆడియ‌న్స్ ను అల‌రించిందో చూద్దాం….

కథ :
కధా ప‌రంగా చెప్పుకుంటే ఒక ఆర్డ‌న‌రీ కుర్రాడు. డిజిట‌ల్ మార్కెటింగ్ చేసుకుంటూ.. త‌న లైఫ్ త‌ను లీడ్ చేస్తుంటాడు. తండ్రి చెప్పిన మంచి మాట‌లు జీవితంలో సంద‌ర్భానుసారంగా పాటిస్తుంటాడు. నిజం చెప్పాలంటే.. తండ్రి ఆశించిన‌ట్లు జీవించాల‌నుకునే కుర్రాడు. అటువంటి అబ్బాయి ఆధునిక భావాలు క‌ల‌గిన అనామిక అలియాస్ ప్ర‌ణీత మ‌న‌సు గెల‌చుకుంటాడు. లవ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్నట్టుగా ఇద్ద‌రికి వెవ్ లెంగ్త్ క‌లుస్తుంది. ప్ర‌ణీత కు హీరో శివాజీ అలియాస్ విష్ణు ప‌రిచ‌యం అయిన రెండో రోజునే త‌న ప్లాట్ కు ఆహ్వానిస్తుంది. హీరో వాష్ రూమ్ కు హీరో వెళ్ల‌గానే హీరోయిన్ కిడ్నాప్ కు గురవుతుంది. హీరో ఆమేను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలో పోలీసుల్ని పిలుస్తాడు. పోలీసుల్లో ఒక‌రు విష్ణు ను చంప‌డానికి ( ర‌విప్ర‌కాష్ ) ప్ర‌య‌త్నిస్తాడు. మ‌రొకరు ( ఎస్ ఐ స్వామి రోల్ చేసిన నాగినీడు) సేవ్ చేసి విష్ణు కోసం త‌ను ప్రాణాలు పోగొట్టుకుంటాడు.

హీరోయిన్ ను సేవ్ చేసే ప‌రిణామ‌క్ర‌మంలో హీరోకు కొన్ని నిజాలు తెలుస్తాయి. హీరోయిన్ తండ్రి ఒక చానెల్ సిఈవో. ఒక చిప్ కోసం.. చానెల్ సీఈవో కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. విష్ణు కిడ్నాప‌ర్స్ నుంచి ప్ర‌ణీత ను ర‌క్షించి..చిప్ ను కూడ తీసుకొస్తాడు. అక్క‌డ నుంచి క‌థ ఎన్నో మ‌లుపులు తీసుకుంటుంది. ఇంతింతై వ‌టుడింతై అనే చందంగా.. ఆ చిప్ ఇష్యూ కు సంబంధించి సెంట్ర‌ల్ మినిష్ట‌ర్ బుషిదేవ్ అలియాస్ జేడి చ‌క్ర‌వ‌ర్తి ఎంట‌ర్ అవుతాడు. విష్ణు ను, ప్ర‌ణీత‌ను చంప‌డానికి పోలీస్ ప‌వ‌ర్ ను .. చ‌ట్టాన్ని, అడ్డ‌గోలుగా బుషిదేవ్ వాడేసుకుంటాడు. చివ‌ర‌కు యుద్దం, ఆర్డ‌న‌రి యువ‌కుడైన విష్ణుకు.. అసాధ‌ర‌ణ బ‌లం (పొలిటిక‌ల్, పోలీస్, మినిష్ట‌రీ, ఎవ్రీథింగ్..) వున్న మినిష్ట‌ర్ మ‌ధ్య చాల తీవ్రంగా న‌డుస్తుంది. ఆ మినిష్ట‌ర్ కు కావాల‌సింది వీరి ద‌గ్గ‌రు ఏముంది…? మినిష్ట‌ర్ తో హీరో, హీరోయిన్ ఎందుకు త‌ల‌ప‌డ్డారు..? అనే విష‌యం తెర‌మీద చూడాల్సిందే.

డైరెక్ట‌ర్ ప‌నితీరు..
‘డైనమైట్’ సినిమా టైటిల్ లానే ధనాధన్ ధనాధన్ అంటూ సాగుతూ ఆన్ స్క్రీన్ పై బాగానే పేలింది. ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి 3 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవే దేవకట్టా స్క్రీన్ ప్లే, విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఫైనల్ గా మంచు విష్ణు ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్. ముందుగా దేవకట్టా విషయానికి వస్తే.. రీమేక్ సినిమా అయినా తెలుగు వారికి తగ్గట్టుగా ఆయన చిన్న చిన్న మార్పులు చేసి రాసిన స్క్రీన్ ప్లే చాలా వరకూ సినిమాకి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా మొదటి 20 నిమిషాల తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకూ సినిమా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఒరిజినల్ వెర్షన్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ, కానీ ఇందులో ఎక్కువ ప్లాన్ చేసారు. విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు చేజింగ్ సీక్వెన్స్ లని ఎక్కడా బోర్ కొట్టించకుండా డిజైన్ చేసారు.

ఆర్టిస్ట్ ల ప‌నితీరు..
ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచిన హీరో మంచు విష్ణు విషయానికి వస్తే.. మంచు విష్ణుకి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేయాలంటే భలే ఇష్టం, అలాంటి పాత్ర చేసే అవకాశం ఈ సినిమాలో రావడంతో తన పాత్ర కోసం ఏమేమి చేయాలో అన్నీ చేసాడు. విష్ణు చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫైట్స్ పరంగా విష్ణులో ఓ కొత్త మానరిజం కనపడుతుంది. ఇక నటుడిగా మరోసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచాడు. ఓవరాల్ గా విష్ణు డైనమైట్ కోసం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక గ్లామర్ డాల్ అనిపించుకున్న ప్రణిత ఎప్పటిలానే గ్లామర్ డాల్ గా కనపడుతూనే రిస్క్ తీసుకొని తను చేసిన రియలిస్టిక్ స్టంట్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక మిస్టర్ కూల్ విలన్ గా జెడి చక్రవర్తి మంచి నటనని కనబరిచాడు. చిన్న పాత్రలో కనిపించిన లేఖ వాషింగ్టన్ బాగానే చేసింది. యోగ్ జపీ, నాగినీడు, రాజ రవీంద్ర, కబీర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఇక సినిమా విషయానికి వస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి మొదటి 20 నిమిషాల తర్వాత సస్పెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఆడియన్స్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇంటర్వల్ వరకూ చాలా స్పీడ్ గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కొన్ని బ్లాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంత సీరియస్ సినిమాలో అక్కడక్కడా ప్రభాస్ శ్రీను, హర్ష చేత చేయించిన కామెడీ నవ్విస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి నుంచి ఎలా సాగుతుంది అనే పరంగా చూసుకుంటూ వస్తే.. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం రాసుకున్న మొదట్లో 20 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వల్ దగ్గర ఆసక్తిని క్రియేట్ చేసారు, కానీ సెకండాఫ్ లో అదే సస్పెన్స్ ని ఆధ్యంతం నడిపించలేకపోయారు. కొన్ని బ్లాక్స్ బాగున్నా కొన్ని మాత్రం చాలా బోర్ కొడతాయి. ప్రీ క్లైమాక్స్ సీన్ ని కాస్త సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సాగదీత వలన 142 నిమిషాల సినిమానే అయినా దానికన్నా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

అలాగే సినిమాకి పాటలతో పెద్ద అవసరం లేదు, కానీ మన తెలుగు ఆడియన్స్ కి అది కావాలి కాబట్టి పెట్టారు. కానీ అవి సినిమా ఫ్లోని దెబ్బ తీయడమే కాకుండా సినిమా రన్ టైంని బాగా పెంచేసాయి అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. డైనమైట్ అనేది రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. ఇలాంటి జానర్ మూవీ టాలీవుడ్ కి కొత్త కావున కొంతమందికి పెద్దగా నచ్చక పోవచ్చు. అలాగే రెగ్యులర్ కామెడీ కోరుకునే వారు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం మైనస్.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో చెప్పుకోదగిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది ఒక చేజింగ్ తరహా మూవీ.. పరిగెత్తాలి మధ్యలో ఫైట్స్ చెయ్యాలి, దూకాలి, గెంతాలి. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా పరిగెత్తి ఆ విజువల్స్ ని పర్ఫెక్ట్ గా కాప్చ్యూర్ చెయ్యాలి ఆ విషయంలో సతీష్ ముత్యాల ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. స్టంట్స్ అప్పుడు తను సెలెక్ట్ చేసుకున్న కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. అచ్చు అందించిన పాటలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి, కానీ చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్ లోని ఇంటెన్స్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేసింది మాత్రం చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్ సినిమా ఫ్లేవర్ ని ఎక్కడా మిస్ చెయ్యలేదు. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ చాలా తెలివిగా ఎడిట్ చేసాడు. సెకండాఫ్ లో మాత్రం అక్కడక్కడా కట్ చేసి ఉంటే బాగుండేది. బివిఎస్ రవి డైలాగ్స్ బాగున్నాయి.

ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయన్ డిజైన్ చేసిన స్టంట్స్ సూపర్బ్. ఆనంద్ శంకర్ అందించిన ఒరిజినల్ కథని 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ వారు బాగానే మార్పు చేసారు. ఆ కథకి దేవకట్టా రాసుకున్న న్యూ వెర్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. అదే సినిమాకి హెల్ప్ అయ్యింది. ఇక డైరెక్టర్ గా ప్రతి ఒక్కరి నుంచి పర్ఫెక్ట్ నటనని రాబట్టుకున్నాడు. ఇకపోతే 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు రీస్క్ చేసి ఇలాంటి న్యూ జానర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.

విశ్లేష‌ణ‌
యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్ కాస్తా ఇమేజ్ వున్న హీరోలు చేయ‌డం త‌క్కువ‌నే చెప్పాలి. మ‌న టాలీవుడ్ లో రెగ్యుల‌ర్ ఫార్మూలా మూవీస్ చేయ‌డానికి చూపించిన ఆసక్తి.. ఈ త‌ర‌హా చిత్రాలు చేయ‌డానికి చూప‌రు. ఎందుకంటే..స‌స్పెన్స్ , థ్రిల్ల‌ర్ మూవీస్ లో హీరోయిజ‌మ్ ఎలివేట్ కావ‌డానికి స్కోప్ త‌క్కువుగా ఉంటుంది. అయితే ఈ విష‌యంలో హీరో విష్ణు ను అభినందించాల్సిందే. అవుటాఫ్ బాక్స్ వ‌చ్చి.. ఒక డిఫ‌రెంట్ ఫిల్మ్ త‌నే స్వ‌యంగా నిర్మాత‌గా ఉంటూ న‌టించారు. థ్రిల్ల‌ర్ మూవీస్ అంటే .. ఏ క్ష‌ణం ఏమి జ‌రుగుతుందో అనే ఉత్కంఠ ఉండ‌టం అనేది ప్ర‌ధానంగా సాగుతుంది. ఆ పాయింట్ ను డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా కొన్ని చోట్ల మ‌రిచిపోయార‌నిపిస్తుంది. సినిమాను మ్యాగ్జిమ‌మ్ రియ‌లిస్టిక్ గా తీర్చిదిద్దడంతో స‌క్సెస్ అయ్యాడు. అయితే రొమాన్స్ కు పెద్ద‌గా స్కోప్ లేదు .. అయితే హీరోయిన్ ప్ర‌ణీత చాల గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. ఫ‌స్టాఫ్ లో కొద్ది సేపు మాత్రమే క‌నిపిస్తుంది. మొద‌టి 20 నిముషాలు డ‌ల్ గా అనిపిస్తుంది. ఆ త‌రువాత స్క్రీన్ ప్లే గంతులు పరుగు పెట్టింది. అంతా బాగానే ఉంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లో ఒక్క రోజు ప‌రిచ‌యం అయిన అమ్మాయి కోసం.. హీరో త‌న ప్రాణాల్ని లెక్క చేయ‌కుండా అమ్మాయి కోసం పోరాడతాడా..? సెకండాఫ్ లో హీరో హీరోయిన్ ను ప‌ట్టుకోవ‌డానికి .. పోలీస్ వ్య‌వ‌స్థ అంతా సాంకేతికంగా అందుబాటులో వున్న టెక్నాలజీని ఉప‌యోగించి .. ప్లాన్స్ వేస్తుంటే.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాడు..? అంత తెలివి వుందా.? టెక్నాలజీ మీద అత‌నికి అంత ప‌ట్టు ఎలా వ‌చ్చింది అనిపిస్తుంది..? అలాగే సినిమా ఏ జోన‌రైనా.. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ పండితే.. ప్రేక్ష‌కులు సంతృప్తి చెందుతారు. అది కాస్త మిస్ అయిన‌ట్లు అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు కొన్ని బాగా లింగ్ చేసి వుండాల్సింది అనిపిస్తుంది. ఏది ఏమైనా.. డైన‌మైట్ పేరు కు త‌గ్గ‌ట్లే ఉంది. కామెడి ఆశించే వార‌కి న‌చ్చ‌క పోవ‌చ్చు. థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డే వారికి ఒక మంచి ద‌మ్ బిర్యానీలాంటింది.

Click Here To Read భలే భలే మగాడివోయ్ మూవీ రివ్యూ

Next Story