Telugu Global
Cinema & Entertainment

మరో హిట్ పై కన్నేసిన రాజ్ తరుణ్

ఉయ్యాల జంపాలాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి మార్కులే కొట్టేశాడు. ఈజ్ ఉన్న నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడీ పక్కింటబ్బాయ్ మరో హిట్ పై కన్నేశాడు. తన అప్ కమింగ్ మూవీ కచ్చితంగా  హిట్టవుతుందని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే.. ఈసారి రాజ్ తరణ్ వెనక ఇద్దరు స్టార్లు ఉన్నారు. వాళ్లే దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఆ సినిమానే కుమారి 21-ఎఫ్. అవును.. సుకుమార్ నిర్మాతగా మారి తొలి […]

మరో హిట్ పై కన్నేసిన రాజ్ తరుణ్
X
ఉయ్యాల జంపాలాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి మార్కులే కొట్టేశాడు. ఈజ్ ఉన్న నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడీ పక్కింటబ్బాయ్ మరో హిట్ పై కన్నేశాడు. తన అప్ కమింగ్ మూవీ కచ్చితంగా హిట్టవుతుందని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే.. ఈసారి రాజ్ తరణ్ వెనక ఇద్దరు స్టార్లు ఉన్నారు. వాళ్లే దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఆ సినిమానే కుమారి 21-ఎఫ్. అవును.. సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా తీస్తున్న సినిమా ఇది. ఇందులో రాజ్ తరుణ్ సరసన హీనా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ లాంటి స్టార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సుకుమార్ ఎంతో ఇష్టపడి రాసుకున్న కథను కరెంట్ దర్శకుడు సూర్య ప్రతాప్ కు అందించి దర్శకత్వం చేయమన్నాడు. ఇలా సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కలిసి తీస్తున్న సినిమా కాబట్టి ఈసారి మరో హిట్ గ్యారెంటీ అనే భావనలో ఉన్నాడు రాజ్ తరుణ్.
Next Story