Telugu Global
Cinema & Entertainment

నాని-తాప్సి హీరోహీరోయిన్లుగా సినిమా

గంగ సినిమాతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెట్టింది తాప్సి. అటు జెండాపై కపిరాజు, పైసా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు హీరో నాని. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వీళ్లిద్దర్నీ పెట్టి ఓ సినిమా తీసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రయత్నిస్తోందని సమాచారం. నిర్మాత సురేష్ బాబు ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం నిర్ధారించడం లేదు. ప్రస్తుతం ఓ […]

నాని-తాప్సి హీరోహీరోయిన్లుగా సినిమా
X
గంగ సినిమాతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెట్టింది తాప్సి. అటు జెండాపై కపిరాజు, పైసా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు హీరో నాని. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వీళ్లిద్దర్నీ పెట్టి ఓ సినిమా తీసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రయత్నిస్తోందని సమాచారం. నిర్మాత సురేష్ బాబు ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం నిర్ధారించడం లేదు. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది తాప్సి. అటు నాని కూడా భలే భలే మగాడివోయ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. రేపు ఈ సినిమా విడుదలవుతోంది. వీళ్లిద్దరి కాల్షీట్లు సెట్ అయిన తర్వాత సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ చుట్టూ చాన్నాళ్లుగా తిరుగుతున్న దర్శకుడు అశోక్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. గతంలో పిల్ల జమీందార్ సినిమాకు దర్శకత్వం వహించాడు అశోక్.
Next Story