Telugu Global
Cinema & Entertainment

గోవాకు షిఫ్ట్ అయిన లోఫర్

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి 150వ సినిమా నుంచి తప్పుకున్న వెంటనే లోఫర్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పూరీ జగన్నాధ్. అప్పట్నుంచి ఈ సినిమా సెట్స్ పైనే బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాజస్థాన్ షెడ్యూల్ పూర్తయింది. ఏకథాటిగా 32 రోజుల పాటు రాజస్థాన్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ఆ భారీ షెడ్యూల్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోవా షిఫ్ట్ […]

గోవాకు షిఫ్ట్ అయిన లోఫర్
X
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి 150వ సినిమా నుంచి తప్పుకున్న వెంటనే లోఫర్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పూరీ జగన్నాధ్. అప్పట్నుంచి ఈ సినిమా సెట్స్ పైనే బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాజస్థాన్ షెడ్యూల్ పూర్తయింది. ఏకథాటిగా 32 రోజుల పాటు రాజస్థాన్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ఆ భారీ షెడ్యూల్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోవా షిఫ్ట్ అయింది లోఫర్ టీం. ఈరోజు నుంచి గోవాలో ఓ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఎంతో ఇష్టమైన స్పాట్ గోవా. తను ఏ సినిమా తెరకెక్కించినా అందులో గోవా కచ్చితంగా కనిపిస్తుంది. పాట, ఫైట్, సీన్.. ఇలా ఏదో ఒకటి గోవాలో షూట్ చేయడం పూరీకి సెంటిమెంట్. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు లోఫర్ ను కూడా గోవాకు షిఫ్ట్ చేశాడు. పటాస్ సినిమాలో విలన్ గా నటించిన చరణ్ దీప్ ఇందులో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వరుణ్ తేజ-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కంచె సినిమా విడుదలైన కొన్ని నెలల గ్యాప్ లోనే లోఫర్ ను కూడా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
First Published:  3 Sep 2015 1:00 AM GMT
Next Story