Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 194

దగ్గేబెటర్‌ రెగ్యులర్‌గా తన దగ్గరకు వచ్చే పేషెంట్‌తో డాక్టర్‌ ఇలా అంటున్నాడు… “నేనిచ్చిన దగ్గు మందు ఇంకా తాగుతున్నావా?” దానికి ఆ పేషెంట్‌ “లేదు డాక్టర్‌. ఒకసారి ఆ మందు కొద్దిగా రుచిచూసి అది తాగడం కన్నా దగ్గడమే మంచిదని నిర్ణయించుకున్నాను” అన్నాడు. ——————————————————————————————– తిండి – బిల్లు ఒక ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్ల మధ్య సంభాషణ ఇలా జరుగుతోంది. అందులో ఒక డాక్టరు అసిస్టెంట్‌. మరొకరు సీనియర్‌. అసిస్టెంట్‌ డాక్టర్‌: డాక్టర్‌ గారూ మీరు పేషెంట్లు […]

దగ్గేబెటర్‌
రెగ్యులర్‌గా తన దగ్గరకు వచ్చే పేషెంట్‌తో డాక్టర్‌ ఇలా అంటున్నాడు…
“నేనిచ్చిన దగ్గు మందు ఇంకా తాగుతున్నావా?”
దానికి ఆ పేషెంట్‌ “లేదు డాక్టర్‌. ఒకసారి ఆ మందు కొద్దిగా రుచిచూసి అది తాగడం కన్నా దగ్గడమే మంచిదని నిర్ణయించుకున్నాను” అన్నాడు.
——————————————————————————————–
తిండి – బిల్లు
ఒక ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్ల మధ్య సంభాషణ ఇలా జరుగుతోంది. అందులో ఒక డాక్టరు అసిస్టెంట్‌. మరొకరు సీనియర్‌.
అసిస్టెంట్‌ డాక్టర్‌: డాక్టర్‌ గారూ మీరు పేషెంట్లు రోజూ ఏమేం తింటారు? అని ఎందుకు అడుగుతూ ఉంటారు?
సీనియర్‌ డాక్టర్‌: వాళ్ల తిండి లెవల్‌ని బట్టి మనం బిల్లు వేయొచ్చని.
——————————————————————————————–
పట్టాలపై సర్దార్జీ
సర్దార్జీ రైలు పట్టాలపై ఒక బాటిల్‌ విస్కీ, తందూరీ చికెన్‌ దగ్గర పెట్టుకుని కూచున్నాడు. దారంటే వెళుతున్న అతను సర్దార్జీని చూసి “సర్దార్జీ పట్టాల మీద ఎందుకు కూచున్నావు? ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ట్రెయిన్‌ వచ్చే అవకాశముంది కదా!” అన్నాడు.
“నాకు బతకాలని లేదు. ట్రెయిన్‌ కింద పడి చనిపోదామని ఇక్కడ కూచున్నా” అన్నాడు సర్దార్జీ.
“మరి విస్కీ, తందూరీ చికెన్‌ ఎందుకు తెచ్చుకున్నావు” అని అడిగాడు అతను.
“ట్రెయిన్‌లు సరైన సమయానికి వస్తాయని గ్యారంటీ లేదు కదా! రాకుంటే ఆకలితో, దాహంతో నేను చనిపోవాల్సి ఉంటుంది. అందుకని” అన్నాడు సర్దార్జీ.

First Published:  2 Sep 2015 1:03 PM GMT
Next Story