Telugu Global
Others

బీసీ హాస్టళ్ళ తనిఖీకి మంత్రి ఆదేశం

బీసీ హాస్టళ్ల స్థితిగతుల అధ్యయనానికి ప్రభుత్వం నడుంబిగించిందని ఆ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బీసీ సంక్షేమశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులంతా బీసీ హాస్టళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. హాస్టళ్లలోని విద్యార్థులకు మెరుగైన భోజన, వసత సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితులను కల్పించాలని, ముఖ్యంగా 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. హాస్టళ్లలో ఈ ఏడాది 10 వేల సీట్లు […]

బీసీ హాస్టళ్ళ తనిఖీకి మంత్రి ఆదేశం
X
బీసీ హాస్టళ్ల స్థితిగతుల అధ్యయనానికి ప్రభుత్వం నడుంబిగించిందని ఆ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బీసీ సంక్షేమశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులంతా బీసీ హాస్టళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. హాస్టళ్లలోని విద్యార్థులకు మెరుగైన భోజన, వసత సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితులను కల్పించాలని, ముఖ్యంగా 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. హాస్టళ్లలో ఈ ఏడాది 10 వేల సీట్లు భర్తీ కానందున వాటిలో కనీసం ఐదు వేల సీట్లను ఇంటర్మీడియట్ విద్యార్థులతో భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. హాస్టల్ విద్యార్థులకు దుస్తుల అందజేతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
First Published:  2 Sep 2015 1:09 PM GMT
Next Story