Telugu Global
Cinema & Entertainment

అంచనాలు పెంచుతున్న ఆ 3 సినిమాలు

శుక్రవారం వచ్చిందంటే సినిమా సందడి ఉండాల్సిందే. అయితే బడా సినిమాలుంటేనే అందరి దృష్టి థియేటర్లపై పడుతుంది. చిన్న సినిమాల్ని చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే బడా సినిమానా, చిన్న సినిమానా అని తేల్చుకోలేని మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తాయి భలే భలే మగాడివోయ్, డైనమేట్ సినిమాలు. వీటితో పాటు రిలీజ్ అవుతున్న డబ్బింగ్ చిత్రం జయసూర్య కూడా ఇలాంటిదే. రేపు రిలీజ్ అవుతున్న ఈ 3 సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల్నిఎట్రాక్ట్ చేస్తున్నాయి. నాని-లావణ్య […]

అంచనాలు పెంచుతున్న ఆ 3 సినిమాలు
X
శుక్రవారం వచ్చిందంటే సినిమా సందడి ఉండాల్సిందే. అయితే బడా సినిమాలుంటేనే అందరి దృష్టి థియేటర్లపై పడుతుంది. చిన్న సినిమాల్ని చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే బడా సినిమానా, చిన్న సినిమానా అని తేల్చుకోలేని మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తాయి భలే భలే మగాడివోయ్, డైనమేట్ సినిమాలు. వీటితో పాటు రిలీజ్ అవుతున్న డబ్బింగ్ చిత్రం జయసూర్య కూడా ఇలాంటిదే. రేపు రిలీజ్ అవుతున్న ఈ 3 సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల్నిఎట్రాక్ట్ చేస్తున్నాయి. నాని-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం భలే భలే మగాడివోయ్. మారుతి డైరక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రయిలర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఇది పక్కా ఎంటర్ టైనింగ్ గా వస్తుంటే.. మరోవైపు పక్కా యాక్షన్ సబ్జెక్ట్ తో డైనమేట్ సిద్ధమైంది. కొన్ని నెలల విరామం అనంతరం దర్శకుడు దేవ్ కట్టా, హీరో విష్ణు కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. ప్రణీత హీరోయిన్ గా నటించింది. సెలక్టివ్ గా సినిమాలు చేసే జేడీ చక్రవర్తి ఇందులో విలన్ గా నటించడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. వీటితో పాటు విశాల్-కాజల్ కలిసి చేసిన డబ్బింగ్ మూవీ జయసూర్య కూడా విడుదలకు సిద్ధం కాబోతోంది. మరి వీటిలో ఏది క్లిక్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచిచూడాల్సిందే.
First Published:  2 Sep 2015 7:00 PM GMT
Next Story