Telugu Global
National

ఇంద్రాణి నేరాన్ని అంగీక‌రించిందా?

షీనా బోరా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలు ఇంద్రాణి ముఖ‌ర్జియా నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈవిష‌యం  సంచ‌ల‌నంగా మారింది.  ఈ కేసులో ఇప్ప‌టికే ఇంద్రాణి మాజీ భ‌ర్త  సంజీవ్ ఖ‌న్నా, డ్రైవ‌ర్ శ్యాంవ‌ర్‌రాయ్‌లు నేరాన్ని ఒప్పుకోగా.. ఇంద్రాణి మాత్రం మాట‌లుమారుస్తూ వ‌స్తోంది. సంజీవ్‌, శ్యాంవ‌ర్‌లు అప్రూవ‌ర్లుగా మారార‌ని పోలీసుల ద్వారా తెలుసుకున్న ఇంద్రాణి నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. వారంరోజులుగా షీనా బ‌తికే ఉంద‌ని కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించిన ఇంద్రాణిని పోలీసులు త‌మ‌దైన శైలిలో […]

ఇంద్రాణి నేరాన్ని అంగీక‌రించిందా?
X
షీనా బోరా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలు ఇంద్రాణి ముఖ‌ర్జియా నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈవిష‌యం సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఇంద్రాణి మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నా, డ్రైవ‌ర్ శ్యాంవ‌ర్‌రాయ్‌లు నేరాన్ని ఒప్పుకోగా.. ఇంద్రాణి మాత్రం మాట‌లుమారుస్తూ వ‌స్తోంది. సంజీవ్‌, శ్యాంవ‌ర్‌లు అప్రూవ‌ర్లుగా మారార‌ని పోలీసుల ద్వారా తెలుసుకున్న ఇంద్రాణి నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. వారంరోజులుగా షీనా బ‌తికే ఉంద‌ని కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించిన ఇంద్రాణిని పోలీసులు త‌మ‌దైన శైలిలో విచారించి.. ఆమె నోటితోనే నిజం చెప్పించార‌ని తెలుస్తోంది! అయితే ఈ విష‌యాన్ని పోలీసులు ఇంకా ధ్రువీక‌రించాల్సి ఉంది. బుధ‌వారం పోలీసులు విచార‌ణ‌లో భాగంగా ఇంద్రాణి ప్ర‌స్తుత భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జియా నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
First Published:  2 Sep 2015 5:04 PM GMT
Next Story