Telugu Global
Others

రష్యా సముద్ర జలాల్లో చైనా మిలటరీ నౌకలు

బేరింగ్ సముద్ర జలాల్లో చైనా మిలటరీ నౌకలు తచ్చాడినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. చైనాకు చెందిన ఐదు మిలటరీ నౌకలు రష్యా, అలస్కాల మధ్య గల సముద్ర జలాల్లో తిరిగినట్లు తాము గుర్తించామని పెటగాన్ పేర్కొంది. చైనా నౌకలు బేరింగ్ జలాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని, తన సముద్ర జలాలను దాటి అంతర్జాతీయంగా తన ప్రభావం చూపడానికి చైనా ప్రయత్నిస్తున్నదనడానికి ఇది నిదర్శనమని నిపుణులు బావిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఏ దేశాలయినా స్వేచ్చగా […]

బేరింగ్ సముద్ర జలాల్లో చైనా మిలటరీ నౌకలు తచ్చాడినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. చైనాకు చెందిన ఐదు మిలటరీ నౌకలు రష్యా, అలస్కాల మధ్య గల సముద్ర జలాల్లో తిరిగినట్లు తాము గుర్తించామని పెటగాన్ పేర్కొంది. చైనా నౌకలు బేరింగ్ జలాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని, తన సముద్ర జలాలను దాటి అంతర్జాతీయంగా తన ప్రభావం చూపడానికి చైనా ప్రయత్నిస్తున్నదనడానికి ఇది నిదర్శనమని నిపుణులు బావిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఏ దేశాలయినా స్వేచ్చగా తిరగవచ్చని, ఉల్లంఘనలకు పాల్పడడం మంచిది కాదని పెంటగాన్‌ పేర్కొంది.
First Published:  2 Sep 2015 1:08 PM GMT
Next Story