Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 193

టూ ఇంటెలిజెంట్‌ “మా ఆవిడ జ్ఞాపకశక్తి దారుణమైంది”. “ఏమిటి? అన్నీ మరచిపోతుందా?” “కాదు, ఏదీ మరచిపోదు”. ———————————————————————— బిల్డప్‌ “నీళ్లలో పడిన నన్ను రక్షించడానికి మీరెంతో శ్రమపడ్డారనుకుంటాను” అందా అమ్మాయి. ఆ కుర్రాడు “అవును. మిమ్మల్ని రక్షించడానికి ముందుకొచ్చిన ముగ్గురితో పోట్లాడాల్సి వచ్చింది” అన్నాడు. ———————————————————————— మాటకు మాట జార్జి తన గాడిదను ఒక ఆర్మీ క్యాంప్‌ పక్కనించి తోలుకెళుతున్నాడు. అది చూసి ఇద్దరు సైనికులు అతన్ని ఉడికించాలని వెళ్ళి “మీ తమ్ముణ్ణి ఎందుకంత గట్టిగా లాగుతున్నవు?” […]

టూ ఇంటెలిజెంట్‌
“మా ఆవిడ జ్ఞాపకశక్తి దారుణమైంది”.
“ఏమిటి? అన్నీ మరచిపోతుందా?”
“కాదు, ఏదీ మరచిపోదు”.
————————————————————————
బిల్డప్‌
“నీళ్లలో పడిన నన్ను రక్షించడానికి మీరెంతో శ్రమపడ్డారనుకుంటాను” అందా అమ్మాయి.
ఆ కుర్రాడు “అవును. మిమ్మల్ని రక్షించడానికి ముందుకొచ్చిన ముగ్గురితో పోట్లాడాల్సి వచ్చింది” అన్నాడు.
————————————————————————
మాటకు మాట
జార్జి తన గాడిదను ఒక ఆర్మీ క్యాంప్‌ పక్కనించి తోలుకెళుతున్నాడు.
అది చూసి ఇద్దరు సైనికులు అతన్ని ఉడికించాలని వెళ్ళి “మీ తమ్ముణ్ణి ఎందుకంత గట్టిగా లాగుతున్నవు?” అన్నారు నవ్వుతూ.
“లేకుంటే వెళ్ళి మిల్ట్రీలో చేరతానంటున్నాడు” అన్నాడు జార్జి.

First Published:  1 Sep 2015 1:03 PM GMT
Next Story