Telugu Global
Cinema & Entertainment

పవన్ ఫ్యాన్స్ కు పుట్టినరోజు గిఫ్ట్

బర్త్ డే బాయ్ పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు కానుక ఇవ్వడం రొటీన్. అదే తన పుట్టినరోజు నాడు పవనే స్వయంగా అభిమానులకు గిఫ్ట్ అందిస్తే అది వెరైటీ. ప్రస్తుతం అదే జరిగింది. తన ఫ్యాన్స్ కోసం పవన్ కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు. బర్త్ డే స్పెషల్ గా విడుదలైన  సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ అదిరిపోయింది. జస్ట్ మూడంటే మూడే ఫ్రేములున్నాయి టీజర్ లో. కానీ ఏదో తెలియని మేజిక్ అందులో కనిపిస్తోంది. […]

పవన్ ఫ్యాన్స్ కు పుట్టినరోజు గిఫ్ట్
X
బర్త్ డే బాయ్ పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు కానుక ఇవ్వడం రొటీన్. అదే తన పుట్టినరోజు నాడు పవనే స్వయంగా అభిమానులకు గిఫ్ట్ అందిస్తే అది వెరైటీ. ప్రస్తుతం అదే జరిగింది. తన ఫ్యాన్స్ కోసం పవన్ కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు. బర్త్ డే స్పెషల్ గా విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ అదిరిపోయింది. జస్ట్ మూడంటే మూడే ఫ్రేములున్నాయి టీజర్ లో. కానీ ఏదో తెలియని మేజిక్ అందులో కనిపిస్తోంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కలర్ కరక్షన్ చేసిన ఎడిటింగ్.. ఇక అల్టిమేట్ పవన్ ఎప్పీయరెన్స్.. టోటల్ గా టీజర్ ను సూపర్ హిట్ చేశాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా. స్క్రిప్ట్-స్క్రీన్ ప్లే-డైలాగుల్లో ఎన్నో మార్పులు చేసిన తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సర్దార్ గబ్బర్ సింగ్ ను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. నార్త్ స్టార్ బ్యానర్ పై శరత్ మరార్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  1 Sep 2015 7:00 PM GMT
Next Story