Telugu Global
Cinema & Entertainment

రుద్ర‌మదేవి ద‌స‌రా పండ‌గ స్పెష‌ల్..

గుణ‌శేఖ‌ర్   స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో అనుష్క లీడ్ రోల్ లో వ‌స్తున్న రుద్ర‌మదేవి చిత్రం  రిలీజ్ మ‌రోసారి వాయిదా ప‌డింది.  వాస్తవంగా  బాహుబ‌లి కి ముందే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ..  విజువ‌ల్ ఎఫెక్ట్స్  వ‌ర్క్ డీలే కావ‌డం వ‌లన  ఆ స‌మ‌యానికి రిలీజ్ చేస్తున్న‌ట్లు  అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు.  ఆ త‌రువాత‌  మ‌రో కొత్త డేట్ ను ఎనౌన్స్ చేశారు. అది సెప్టెంబ‌ర్  4న  ప్ర‌పంచ వ్యాప్తంగా , తెలుగు,  త‌మిళ్  లాంగ్వేజెస్ లో […]

రుద్ర‌మదేవి ద‌స‌రా పండ‌గ స్పెష‌ల్..
X
గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో అనుష్క లీడ్ రోల్ లో వ‌స్తున్న రుద్ర‌మదేవి చిత్రం రిలీజ్ మ‌రోసారి వాయిదా ప‌డింది. వాస్తవంగా బాహుబ‌లి కి ముందే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ డీలే కావ‌డం వ‌లన ఆ స‌మ‌యానికి రిలీజ్ చేస్తున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత‌ మ‌రో కొత్త డేట్ ను ఎనౌన్స్ చేశారు. అది సెప్టెంబ‌ర్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా , తెలుగు, త‌మిళ్ లాంగ్వేజెస్ లో రుద్ర‌మదేవి సినిమాను ఒకే రోజు రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్రెస్ మీట్ లో తెలిపారు. తీరా స‌మ‌యం వ‌చ్చే స‌రికి రిలీజ్ ను మ‌ళ్లీ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
మ‌ళ్లీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ..! సేమ్ ప్రాబ్ల‌మ్. విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే సెప్టంబ‌ర్ లో రిలీజ్ చేయ‌లేక పోతున్నారుట‌. మ‌ళ్లీ ఎప్పుడు..! వ‌చ్చెనెల 9 న వంద‌కు వంద శాతం రిలీజ్ చేస్తార‌ట‌. అప్ప‌టికి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా కంప్లీట్ అవుతుంద‌ట‌. ముందు నుంచి సినిమా ప‌రిశీల‌కులు గెస్ చేసిందే నిజం అయ్యింది. ఏప్రిల్ నెలలో చప్పుడు చేయ‌క పోవ‌డంతో.. రుద్ర‌మదేవి ద‌స‌రా బ‌రిలో రావోచ్చ‌ని ఫిల్మ్ క్రిటిక్స్ గెస్ చేశారు. వాళ్లు ఊహించ‌నిట్లే… రుద్ర‌మదేవి ద‌స‌రా పండ‌గ బ‌రిలో వ‌స్తుంది. ఈ చిత్రంలో అనుష్క తో పాటు.. రానా, బ‌న్నీ లు కీ రోల్స్ చేశారు. తెలుగు, తమిళం తో పాటు..హిందిలో కూడా డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. మొత్తం మీద ద‌సరా పండ‌క్కు మ‌న కాక‌తీయుల వీర‌నారి జీవిత క‌థ‌ను చూడ‌బోతున్న‌ట్లే మ‌రి.
Next Story