Telugu Global
Cinema & Entertainment

బాహుబలితో రుద్రమదేవికి కాసుల పంట...?

బాహుబలికి లభించిన ప్రేక్షకాదరణ ప్రభావం ఇపుడు రుద్రమదేవిపై పడింది. రూ. 150 కోట్లతో బాహుబలి నిర్మించగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది రూ. 600 కోట్లను ఆర్జించింది. దీన్నే ప్రాతిపదికగా చేసుకుని రుద్రమదేవి సినిమాను కొనడానికి బయ్యర్లు ఎగబడుతున్నారు. ఈ సినిమాను రూ. 70 కోట్లతో నిర్మించామని నిర్మాతలు చెబుతుండగా ఆ సొమ్ములో మెజారిటీ భాగం వచ్చేసినట్టు తెలుస్తోంది. ఒడిషా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బయ్యర్లు ఈ సినిమా హక్కులను సంపాదించేసు కున్నారు. […]

బాహుబలితో రుద్రమదేవికి కాసుల పంట...?
X

బాహుబలికి లభించిన ప్రేక్షకాదరణ ప్రభావం ఇపుడు రుద్రమదేవిపై పడింది. రూ. 150 కోట్లతో బాహుబలి నిర్మించగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది రూ. 600 కోట్లను ఆర్జించింది. దీన్నే ప్రాతిపదికగా చేసుకుని రుద్రమదేవి సినిమాను కొనడానికి బయ్యర్లు ఎగబడుతున్నారు. ఈ సినిమాను రూ. 70 కోట్లతో నిర్మించామని నిర్మాతలు చెబుతుండగా ఆ సొమ్ములో మెజారిటీ భాగం వచ్చేసినట్టు తెలుస్తోంది. ఒడిషా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బయ్యర్లు ఈ సినిమా హక్కులను సంపాదించేసు కున్నారు. దీనివల్ల రుద్రమదేవి నిర్మాతలు హ్యాపీగా ఉన్నట్టు ఫిలింనగర్‌ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా అనుష్కాకు తమిళనాడులోను, కన్నడనాట అభిమానులు దండిగా ఉన్నారు. దీంతోపాటు అల్లు అర్జున్‌ (బన్నీ)కి కేరళలో అభిమానులు అధికం. ఈ మూడు రాష్ట్రాల హక్కులను కొనడానికి ఇదే ప్రాతిపదికగా కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాలు అభిమానుల ప్రాతిపదికగా సినిమాను కొనుగోలు చేస్తే తామెక్కడ వెనుకబడిపోతామోనన్న కారణంతో ఒడిషా కూడా ఈ రేసులో పాల్గొందంటున్నారు. మొత్తం మీద రుద్రమదేవికి ఈ విధంగా గిరాకీ ఏర్పడిందన్న మాట!

First Published:  1 Sep 2015 12:00 AM GMT
Next Story