Telugu Global
Cinema & Entertainment

విష్ణు వ‌ర్సెస్ నానీ..!

ఈ శుక్ర‌వారం   ఇద్ద‌రు యంగ్ హీరోలు తమ‌ అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యారు.   వారిలో   విష్ణు  డైన‌మైట్ అనే చిత్రంతో వ‌స్తుండ‌గా..  హీరో నానీ..  భ‌లే భ‌లే మ‌గాడివోయ్  చిత్రంతో వ‌స్తున్నాడు.   విష్ణు గ‌త యేడాది  దైనికైన రెడీ చిత్రం తో మెప్పించాడు. మ‌రి ఈ యేడాది ఇంత వ‌ర‌కు  బాక్సాఫీస్ వ‌ద్ద  త‌న కొత్త సినిమా ఏది ప‌డ‌లేదు.  అయితే లేటుగా వ‌చ్చినా..లేటెస్ట్ అన్న‌ట్లు..  డైన‌మైట్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ […]

విష్ణు వ‌ర్సెస్ నానీ..!
X
ఈ శుక్ర‌వారం ఇద్ద‌రు యంగ్ హీరోలు తమ‌ అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యారు. వారిలో విష్ణు డైన‌మైట్ అనే చిత్రంతో వ‌స్తుండ‌గా.. హీరో నానీ.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో వ‌స్తున్నాడు. విష్ణు గ‌త యేడాది దైనికైన రెడీ చిత్రం తో మెప్పించాడు. మ‌రి ఈ యేడాది ఇంత వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద త‌న కొత్త సినిమా ఏది ప‌డ‌లేదు. అయితే లేటుగా వ‌చ్చినా..లేటెస్ట్ అన్న‌ట్లు.. డైన‌మైట్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో వ‌స్తున్నాడు. టైటిలే ఇంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండే.. సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో వుంటాయో అని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. డైన‌మైట్ చిత్రంలో ఫైట్స్ సీన్స్ కోసం చాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడ‌ట హీరో విష్ణు. స‌హ‌జంగా ఉండే విధంగా కంపోజ్ చేయించార‌ట‌. మ‌రి ప్ర‌చారం ప‌రంగా ఒకింత స్లో గా వున్న డైన‌మైట్ చిత్రం.. ఏ రేంజ్ హిట్ కొడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక ఒక మంచి హిట్ కోసం పోరాడుతున్న యువ హీరో నానీ.. ఈ సారి త‌న రోటిన్ స్టైల్ కు భిన్నంగా ..భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే వినోదాత్మ‌క చిత్రంతో వ‌స్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం కూడా ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది. నానీ మొద‌టి సారి హండ్రెట్ ప‌ర్సెంట్ కామెడి చేసిన ఈ చిత్రం త‌న‌కు మంచి హిట్ ఇస్తుంద‌ని ఆశిస్తున్నాడు. జెండా పై క‌పిరాజు.. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రాలు ఈ యేడాది రిలీజ్ అయ్యాయి. న‌టుడిగా మంచి మార్కులే ప‌డ్డ‌ప్ప‌టికి.. క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ మాత్రం రాలేదు. అందుకే ఈ సారి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. మ‌రి ఒక వైపు విష్ణు.. మ‌రో వైపు నానీ.. ఇద్ద‌రిలో హిట్ హీరో అని ఎవ‌రు అనిపించుకుంటారో.. లెట్స్ వెయింట్ అండ్ సీ.
First Published:  30 Aug 2015 11:30 PM GMT
Next Story