Telugu Global
Cinema & Entertainment

మాధ‌వ‌న్ కూడా  క‌బ్జాలు చేస్తున్నాడు..!

క‌బ్జాలంటే సాధార‌ణంగా రియ‌ల్ దందాలు చేసే రౌడి గ్యాంగ్‌లే జ్ఞాప‌కం వ‌స్తారు. కానీ ఈ మ‌ధ్య సెల‌బ్రిటీలు కూడా ఈ విష‌యంలో   క‌నిపిస్తున్నారు. తాజ‌గా హీరో మాధ‌వ‌న్  చేరారు. సాగునీటి కాలువ భూములను ఆక్రమించినట్లు హీరో మాధవన్‌పై తమిళనాడులోని దిండుకల్‌ జిల్లా కలెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పళని సమీపంలోని విలాంగోంబై తేక్కన్‌ ఫార్మ్‌లోని టీటీఎల్‌ సాగునీటి కాలువ భూమిని ఆయన ఆక్రమించారని కలెక్టరు హరిహరన్‌కు తేని రైతులు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల కిందట ఏడెకరాల భూమిని […]

మాధ‌వ‌న్ కూడా  క‌బ్జాలు చేస్తున్నాడు..!
X
క‌బ్జాలంటే సాధార‌ణంగా రియ‌ల్ దందాలు చేసే రౌడి గ్యాంగ్‌లే జ్ఞాప‌కం వ‌స్తారు. కానీ ఈ మ‌ధ్య సెల‌బ్రిటీలు కూడా ఈ విష‌యంలో క‌నిపిస్తున్నారు. తాజ‌గా హీరో మాధ‌వ‌న్ చేరారు. సాగునీటి కాలువ భూములను ఆక్రమించినట్లు హీరో మాధవన్‌పై తమిళనాడులోని దిండుకల్‌ జిల్లా కలెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పళని సమీపంలోని విలాంగోంబై తేక్కన్‌ ఫార్మ్‌లోని టీటీఎల్‌ సాగునీటి కాలువ భూమిని ఆయన ఆక్రమించారని కలెక్టరు హరిహరన్‌కు తేని రైతులు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల కిందట ఏడెకరాల భూమిని కొనుగోలు చేసిన మాధవన్‌ ఆ తర్వాత సాగునీటి కాలువను ఆక్రమించుకుని విద్యుత్తు కంచె ఏర్పాటు చేసుకున్నారని, దీనికి రెవెన్యూ అధికారులు కొందరు సహకరించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ, ప్రజాపనులశాఖ అధికారులను దిండుకల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. మాధవన్‌ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు.
First Published:  30 Aug 2015 7:04 PM GMT
Next Story