Telugu Global
Others

అమితాబ్ ట్విట్టర్ ఎకౌంట్ హాక్

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తమ భద్రత, గోప్యత గురించి సెలబ్రిటీలు భయపడుతుంటారు. అందువల్లే వారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండటానికి ఇష్టపడరు. దీనికి కారణం అడపాదడపా వారి ఎకౌంట్లు హ్యాక్ కావడమే. మొదట్లో ట్విట్టర్ ఖాతాను కలిగి ఉన్న అతి తక్కువ మంది బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. తాజాగా అమితాబ్ ట్విట్టర్ ఎకౌంట్ హాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. నా ట్విట్టర్ ఎకౌంట్ హాక్‌కు గురయింది, అశ్లీల చిత్రాలను […]

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తమ భద్రత, గోప్యత గురించి సెలబ్రిటీలు భయపడుతుంటారు. అందువల్లే వారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండటానికి ఇష్టపడరు. దీనికి కారణం అడపాదడపా వారి ఎకౌంట్లు హ్యాక్ కావడమే. మొదట్లో ట్విట్టర్ ఖాతాను కలిగి ఉన్న అతి తక్కువ మంది బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. తాజాగా అమితాబ్ ట్విట్టర్ ఎకౌంట్ హాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. నా ట్విట్టర్ ఎకౌంట్ హాక్‌కు గురయింది, అశ్లీల చిత్రాలను దానిలో ఉంచారు. ఈ పని చేసిన మిత్రుడు ఎవరో గానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదంటూ ట్విట్టర్‌లో సున్నితంగా మందలించారు.
First Published:  30 Aug 2015 1:15 PM GMT
Next Story