Telugu Global
CRIME

మ‌తిస్థిమితం లేని బాలిక‌పై సామూహిక అత్యాచారం!

మతిస్థిమితం లేని బాలికపై పలువురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఎల్బీనగర్ సర్కిల్‌లోని హస్తినాపురం, ఇంద్రప్రస్థకాలనీలో నివాసముంటుంది. బాధితురాలి తండ్రి కూలీ పనులకు వెళ్తుంటాడు. కూతురు, తల్లితోపాటే సొంత ఊరిలోనే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి వద్దకు వారిద్దరు వచ్చి వెళ్తుండేవారు. రెండురోజుల క్రితం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను అక్కడే నివాసముంటున్న ఓ […]

మ‌తిస్థిమితం లేని బాలిక‌పై సామూహిక అత్యాచారం!
X
మతిస్థిమితం లేని బాలికపై పలువురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఎల్బీనగర్ సర్కిల్‌లోని హస్తినాపురం, ఇంద్రప్రస్థకాలనీలో నివాసముంటుంది. బాధితురాలి తండ్రి కూలీ పనులకు వెళ్తుంటాడు. కూతురు, తల్లితోపాటే సొంత ఊరిలోనే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి వద్దకు వారిద్దరు వచ్చి వెళ్తుండేవారు. రెండురోజుల క్రితం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను అక్కడే నివాసముంటున్న ఓ ఆటోడ్రైవర్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో ఆదిబట్లలోని ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story