Telugu Global
NEWS

ఆంధ్ర పాఠ్యాంశాల నుంచి తెలంగాణ అంశాల తొలగింపు

తెలంగాణ-ఆంధ్ర రెండు కళ్ళు అన్న చంద్రబాబునాయుడు నేతృత్వంలోని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ గుర్తులన్నీ చెరిపివేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠ్యాంశాల జాబితాలో తెలంగాణకు చెందిన అంశాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. 8వ తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. సింగరేణి బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించినది కాదు అనే కారణంతో సింగరేణి బొగ్గు గనుల పాఠాన్ని తొలగించారు. ఇక […]

ఆంధ్ర పాఠ్యాంశాల నుంచి తెలంగాణ అంశాల తొలగింపు
X
తెలంగాణ-ఆంధ్ర రెండు కళ్ళు అన్న చంద్రబాబునాయుడు నేతృత్వంలోని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ గుర్తులన్నీ చెరిపివేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠ్యాంశాల జాబితాలో తెలంగాణకు చెందిన అంశాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. 8వ తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. సింగరేణి బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించినది కాదు అనే కారణంతో సింగరేణి బొగ్గు గనుల పాఠాన్ని తొలగించారు. ఇక 9 వ తరగతి ఉపవాచకంలో ఉన్న కాపు రాజయ్య, మిద్దెరాములు పాఠాలు తీసేశారు. 6వ తరగతి ఇంగ్లీష్‌లో ఉన్న ఇన్ ది బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే సరోజినీ నాయుడు పద్యాన్ని కూడా తొలిగించినట్లు ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. విశాలాంధ్ర కోసం పదవీత్యాగం చేసిన బూర్గుల పాఠం అవసరం లేదన్నారు. కవులకు ప్రాంతీయభేదాలా? అంటూ రచ్చరచ్చ చేసిన పెద్దలు బసవేశ్వరుడి పాఠం నిష్కర్షగా తీసేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తన పాఠ్యాంశాలను కూడా సవరించింది కాని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంశాల విషయంలో విశాల దృక్పథాన్ని చూపించింది. తెలుగు భాష అంశానికి సంబంధించి మహా కవుల ఎంపికలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని విస్మరించలేదు. ఆ ప్రాంతానికి చెందిన కవులు, వారి రచనలను కూడా తెలంగాణ పాఠ్యాంశాల్లో చేర్చారు. తెలుగు పుస్తకాల్లో నన్నయ్య, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, చేమకూర వేంకటకవి, శ్రీనాథుడు, వేమన, సుమతి తదితర శతకాల నుంచి పద్యాలు, గద్యభాగాలు తెలంగాణ పాఠాల్లో చోటు దక్కించుకున్నాయి.
First Published:  29 Aug 2015 1:57 AM GMT
Next Story