Telugu Global
Others

సత్సంగ్‌లో రాధేమా పరివారం నగ్న నృత్యాలు

అర్ధనగ్న ఫొటోలతో ఇటీవల మీడియాలో సంచలంగా మారిన రాధే మాపై ఆమె మాజీ భక్తురాలు డాలీ బింద్రా సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని రాధే మా తనను వేధించిందని ఇటీవల ఆరోపించిన ఆమె, ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని విషయాలు వెల్లడించారు. రాధే మా నిర్వహించే సత్సంగ్‌లో అందరూ బాలీవుడ్ ఐటంసాంగ్స్‌కు డ్యాన్సులు చేసేవారు. రాధే మా ఆదేశంతో ఆమె అనుచరులు నగ్నంగా నృత్యాలు చేసేవారు. ఆమె భక్తులతో పంజాబీలో […]

సత్సంగ్‌లో రాధేమా పరివారం నగ్న నృత్యాలు
X
అర్ధనగ్న ఫొటోలతో ఇటీవల మీడియాలో సంచలంగా మారిన రాధే మాపై ఆమె మాజీ భక్తురాలు డాలీ బింద్రా సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని రాధే మా తనను వేధించిందని ఇటీవల ఆరోపించిన ఆమె, ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని విషయాలు వెల్లడించారు. రాధే మా నిర్వహించే సత్సంగ్‌లో అందరూ బాలీవుడ్ ఐటంసాంగ్స్‌కు డ్యాన్సులు చేసేవారు. రాధే మా ఆదేశంతో ఆమె అనుచరులు నగ్నంగా నృత్యాలు చేసేవారు. ఆమె భక్తులతో పంజాబీలో అసభ్యకరంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటపెట్టడంతో నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని తెలిపారు. అయితే డాలీ ఆరోపణలను రాధే మా భక్తుడు, సినీ ప్రముఖుడు ప్రహ్లాద్ కక్కర్ కొట్టి పారేశారు. ప్రచారం కోసమే ఆమె ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
First Published:  28 Aug 2015 1:01 PM GMT
Next Story